Train Roof : మనం ప్రయాణం చేయాలంటే రోడ్డు, రైలు, వాయు, జల మార్గాలున్నాయి. ఇందులో రోడ్డు, రైలు మార్గాలు ఎక్కువగా వాడుతారు. భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోనే నాలుగో పెద్ద రైల్వే వ్యవస్థగా ఆసియాలో రెండో వ్యవస్థగా రూపొందింది. రైల్వే స్టేషన్ల సంఖ్య దాదాపు 8 వేలుగా ఉంది. దీంతో మన రైల్వే వ్యవస్థ ఎంతో చౌకగా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే మన రైల్వే నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.
రైలు కోచ్ లపైన ఉండే మూతల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఎందుకుంటాయి? వాటి వల్ల ప్రయోజనాలేమిటో ఆలోచించారా? వాటిలో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. పెట్టెల మీద ఉండే మూతలతో మనకు లాభాలేంటో చూద్దాం. రైలు కోచ్ లపై మూతలు ఎందుకు పెడతారు. కోచ్ పై ఉండే మూతలను వెంటిలేటర్ లు అంటారు.
రైలులో ఎక్కువ మంది ప్రయాణిస్తుండటంతో కోచ్ లు కిక్కిరిసిపోతాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. వెంటిలేటర్లు తేమ, వేడిని తొలగిస్తాయి. ప్రయాణిస్తున్నప్పుడు సీలింగ్ పై గుండ్రని రంధ్రాలతో కూడిన విండోలు ఉంటారు. వీటిని రైలు కోచ్ పైన ఉన్న ప్లేట్లకు అతికిస్తుంటారు. దీంతో రైలు వేడి లేదా గాలి బయటకు వెళుతుంది. వెచ్చని గాలి పైకి వెళ్తుంది.
వేడి గాలి కోచ్ లోపల వెంటిలేషన్ ద్వారా లేదా మెష్ ద్వారా రూఫ్ వెంటిలేటర్ల ద్వారా బయటకు పోతుంది. దూరం నుంచి చూస్తే మూతలా కనిపిస్తుంది. వెంటిలేటర్ పైన గుండ్రటి లేదా ప్లేట్లు ఉంచుతారు. ఇది రైలులోని వేడి గాలిని రూఫ్ వెంటిలేటర్ల ద్వారా బయటకు పంపుతుంది. ఇలా గాలి ఆడేందుకు వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఈనేపథ్యంలో వీటి ప్రాధాన్యం అలా ఉంటుంది.