Vastu Tips : మనం వాస్తు ప్రకారం నడుచుకుంటాం. ప్రతిది ఇంట్లో వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటాం. లేకపోతే ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకపోతే మనకు నష్టమే కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కలిసి రావాలంటే వాస్తు ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పని చేసే ఆఫీసు డెస్క్ పై ఏం ఉంచుకోవాలి? ఏం ఉంచుకోకూడదో తెలుసుకోవాలి. లేకపోతే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. పురోగతికి అడ్డు తగులుతుంది. అభివృద్ధి కుంటుపడుతుంది.
వెదురు మొక్క
ఆఫీస్ డెస్క్ మీద వెదురు మొక్కను ఉంచుకోవడం చాలా మంచిది. దీన్ని లక్కీ బాంబు అని చెబుతారు. ఇది ఉంటే పరిసరాల్లో సానుకూలత, శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టానికి ఇది నిదర్శనంగా భావిస్తుంటారు. డెస్క్ మీద దీన్ని ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని అంటారు. వెదురు మొక్కతో మనకు ఇన్ని రకాల లాభాలు దాగి ఉన్నాయి.
క్రిస్టల్
వాస్తు ప్రకారం ఆఫీస్ డెస్క్ మీద క్రిస్టల్ తో చేసిన వస్తువులు ఉంచుకోవడం వల్ల లాభం కలుగుతుంది. స్పటికంతో తయారు చేసిన వస్తువులు ఉంచుకుంటే కూడా మంచిదే. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ దక్కుతుంది. నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఇవి వాస్తు ప్రకారం మనకు మేలు చేస్తాయి.
ఓడ
బంగారు నాణాలతో తయారు చేసిన ఓడ మనం పనిచేసే డెస్క్ మీద ఉంచుకుంటే చాలా మంచిది. మన కెరీర్ పురోగమనంలో ఉంటుంది. మన ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చుతాయి. ఆఫీస్ డెస్క్ మీద ఇలాంటి వస్తువులు ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. బంగారు నాణాల ఓడ ఉంచుకోవడం వల్ల మన అదృష్టం ఇనుమడిస్తుంది.
గందరగోళం
వాస్తు ప్రకారం మన డెస్క్ చిందరవందరగా ఉండకుండా చూసుకోవాలి. డెస్క్ పై చెత్తచెదారం ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా ఉంచుకుంటే వాతావరణం బాగుండదు. అనవసర కాగితాలు లేకుండా చూసుకోవాలి. స్టేషనరీ, ఇతర వస్తువులు ఉండకూడదు. ఇలాంటి వస్తువులు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయి. డెస్క్ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.