Whoop : Whoop సంస్థ ఫిట్ నెస్ ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఆరోగ్య రంగంలో సాంకేతికత పరికరాలను రూపొందిస్తుంది. అథ్లెట్లు, ఆరోగ్య పరిరక్షణకు పాటుపడే వారికి whoop సంస్థ తయారు చేసే ఉపకరణాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి.. అయితే ఈ కంపెనీ గురువారం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. అత్యాధునిక ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. దీనిని 29, 990(ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ లో 3000 తగ్గింపు)కు విక్రయిస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. Whoop స్మార్ట్ వాచ్ అసమానమైన ఫిట్ నెస్ అనుభవాన్ని అందిస్తుంది. రికవరీ, స్ట్రెయిన్, స్లీప్, స్ట్రెస్ వంటి వాటిని ఈ వాచ్ లో చూసుకోవచ్చు. ఒక వ్యాధి నుంచి మనం ఎంత స్థాయిలో రికవరీ అయ్యామో, ఒక పనిలో ఎంత స్ట్రెయిన్, స్ట్రెస్ కు గురయ్యామో, మనం ఎంతసేపు పడుకున్నామో.. వంటి వాటిని whoop యాప్ లో చూసుకునే వెసలుబాటు ఉంది.. పై వాటన్నింటినీ whoop ఒక ఆల్గారిథం లాగా చూపిస్తుంది.. దీనివల్ల మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది. ఎలాంటివి చేయాలో? ఎలాంటివి చేయకూడదనే విషయాలపై అంచనా లభిస్తుంది.. వ్యక్తిగత ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా దృష్టి సారించేలా చేస్తుంది.. గుండె, కండరాలపై పడుతున్న ఒత్తిడిని కూడా ఈ స్మార్ట్ వాచ్ చెబుతుంది…
ఖచ్చితమైన ఆరోగ్య సమాచారం
ఈ వాచ్ ధరిస్తే ఖచ్చితమైన ఆరోగ్య సమాచారం లభిస్తుందని whoop కంపెనీ చెబుతోంది. గుండె పనితీరు, శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకుంటున్న వేగం, పడుకుంటున్న సమయం వంటి వాటిని కచ్చితంగా చెబుతుంది. దీని నిరంతర డాటా క్యాప్చర్ సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఈ వాచ్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 5.5 రోజులపాటు వాడుకోవచ్చు. 24/7 హెల్త్ ట్రాకింగ్ పొందవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. ఈ వాచ్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసిన తర్వాత whoop బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాధా బెన్నెట్ విలేకరులతో మాట్లాడారు. “1.4 బిలియన్ల జనాభాను కలిగి ఉన్న భారత దేశంలో మేము ప్రవేశించాం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారికి ఈ వాచ్ ఎంతగానో ఉపకరిస్తుంది. అథ్లెట్లకు ఉపయోగపడుతుంది.. ఇందులో ఉన్న ఖచ్చితమైన సమాచారం యూజర్లకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఇందులో ఉన్న అద్భుతమైన సౌకర్యాలు ఆరోగ్యంపై మరింత అవగాహనను పెంచుతాయని” ఆమె పేర్కొన్నారు.