WhatsApp Web Hacked: మనలో చాలామంది వాట్స్అప్ వాడుతుంటారు.. అయితే కొంతమంది డివైస్ లింకింగ్ ఫీచర్ ను ఉపయోగించుకొని.. పర్సనల్ కంప్యూటర్ ద్వారా వాట్స్అప్ ఉపయోగిస్తుంటారు. ఈ ఫీచర్ మొన్నటిదాకా హ్యాకర్ల బారిన పడదని.. అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది తప్పని.. హ్యాక్ అవడానికి అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకటించింది.. అంతేకాదు వెలుగులోకి ఫంక్షన్లను నిజాన్ని కూడా తీసుకొచ్చింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం చెప్పినట్టుగా వాట్సప్ వెబ్ ఖాతాను హైజాకర్లు పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు.. అంతేకాదు రియల్ టైం సందేశాలు, ఫోటోలు, వీడియోలను కూడా చూస్తారు. వాటిని తమ కంట్రోల్లోకి తీసుకుంటారు..” సైబర్ మోసగాళ్లు వాట్స్అప్ డివైస్ లింకింగ్ ఫీచర్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఖాతాలను హైజాక్ చేస్తారు.. దీనికి ఎటువంటి అథెంటికేషన్ కూడా అవసరం లేదు.. పాస్వర్డ్లు లేకుండానే, సిమ్ స్వాపింగ్ అక్కర లేకుండా హైజాక్ చేస్తారు” అని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకటించింది.
హైజాకర్లు సైబర్ దాడికి పాల్పడిన తర్వాత ముందుగా హాయ్ అని మెసేజ్ పెడతారు. ఆ తర్వాత చెక్ దిస్ ఫోటో అంటూ మెసేజ్ పెడతారు. అది ఫేస్బుక్లో ఉన్న ప్రివ్యూ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది.. అది ఏకంగా ఫేస్బుక్ వ్యూయర్ కు మళ్లిస్తుంది. ఆ తర్వాత ఆ కంటెంట్ చూడాలంటే వెరిఫై పై క్లిక్ చేయాలని ఒక లింకు వస్తుంది. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు డివైస్ లింకింగ్ ఫీచర్లు ఉపయోగించి ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ వెబ్ లోకి వెళ్తారు. మనం పసిగట్టని విధంగా ఫోన్ నెంబర్లలోకి ప్రవేశించి.. ఆ తర్వాత బాధితులకు తెలియకుండానే వారి వాట్స్అప్ ఖాతాల్లోకి ప్రవేశిస్తారు.
ఘోస్ట్ ఫేరింగ్ ఎటాక్ తర్వాత యూజర్ల ఖాతా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. అది అదనపు, సీక్రెట్ డివైస్ గా ఉంటుంది. ఇందులో పెయిరింగ్ కోడ్ అతెంటిక్ గా దర్శనమిస్తుంది. ఒకసారి సైబర్ నేరగాళ్లు డివైస్ గనక లింక్ చేస్తే వాట్సాప్ వెబ్ లో ఉన్న బాధితుడు సమాచారం మొత్తం నేరగాళ్లకు కూడా వెళుతుంది.
డివైస్ లింక్ అయిన తర్వాత నేరగాళ్లు మెసేజ్లను చదవగలుగుతారు. కొత్త సందేశాలను బాధితుడికి అందిన సమయంలోనే వారికి కూడా అనుతాయి. అంతేకాదు బాతుల కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారందరికీ కూడా సైబర్ నేరగాళ్లు మెసేజులు పంపిస్తారు. అందువల్ల వాట్సాప్ లో అనుమానస్పదంగా వచ్చే మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు. తెలిసిన నెంబర్ల నుంచి వచ్చిన మెసేజ్లను కూడా సాధ్యమైనంతవరకు దూరం పెట్టడం శ్రేయస్కరమని టెక్ నిపుణులు చెబుతున్నారు.