WhatsApp: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో యుద్ధ పరిస్థితులు ఉండడంతో ఆయా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వ్యాపార సముదాయాలను మూయించేశారు. కొన్ని విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత్ పాక్ యుద్ధం కారణంగా ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు వెలువెత్తుతున్నాయి. ఈ పోస్టులో తప్పుడుగా ఉండొద్దని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు మొబైల్ లను హ్యాక్ చేసే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మొబైల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైబర్ నేరగాల వలలో పడకుండా కొన్ని ఆప్షన్లను సెట్ చేసుకోవాలని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ముఖ్యంగా వాట్సాప్ ను ఇలా సెట్ చేసుకొని సేఫ్ జోన్ లో ఉంచుకోవాలని అంటున్నారు. అదేంటంటే?
Also Read: భారత్, పాకిస్తాన్ యుద్ధం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..వీడియో వైరల్!
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. వాట్సాప్ ద్వారా అనేక రకాల మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు పంపిస్తూ ఉంటారు. అయితే యుద్ధం కారణంగా కొన్ని ఫేక్ మెసేజ్లు కూడా వస్తుంటాయి. వీటికి తొందరపడి స్పందించకుండా ఉండాలని అంటున్నారు. కొందరు సైబన్ నేరగాళ్లు లింకులు పంపించి విరాళాలు ప్రకటించాలని అంటారు.. ఇలాంటి వాటిపై ఎక్కువగా స్పందించవద్దని అంటున్నారు. విరాళాలు అడిగే సంస్థలు ప్రముఖమైనవి అయి ఉండాలని అంటున్నారు.అంతేకాకుండా ఎవరైనా లింకు పంపి విరాళాలు పంపించమని అంటే పట్టించుకోవద్దని చెబుతున్నారు.
అయితే కొందరు ఇలాంటి సమయంలో మొబైల్ ను హ్యాక్కుకు గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో వాట్సాప్ ను టూ స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలని అంటున్నారు. ఇందుకోసం వాట్సాప్ పైన రైట్ సైడ్ కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు settings అనే ఆప్షన్ లోకి వెళ్లి privacy advance అనే దానిపై క్లిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా వాట్సాప్ మెసేజ్ హాకింగ్కు గురికాకుండా ఉంటాయి. వీటికి ఎనేబుల్ అనే ఆప్షన్ను ఉంచాలని అంటున్నారు
ఇలా చేయడం ద్వారా వాట్సాప్ ప్రైవసీగా ఉండే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లోనే వాట్సప్ చాట్ ను దొంగిలించి వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుత యుద్ధ సమయంలో కూడా మొబైల్లో జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆప్షన్ను సెట్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా సెట్ చేయడం వల్ల దాదాపుగా హ్యాకర్ మారిన పడే సమాధానం నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అలాగే మొబైల్ కు వచ్చిన సంబంధంలేని మెసేజ్లను కూడా ఓపెన్ చేయవద్దని చెబుతున్నారు.