Venu Swamy: సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో ఒకడు వేణు స్వామి(Venu Swamy). ఈయన సెలబ్రిటీల జాతకాల పై ఎప్పుడూ అశుభాలు మాట్లాడుతూ తీవ్రమైన నెగటివిటీ ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇతను చెప్పినది జరగకపోవడం ఇక మీదట నేను సెలబ్రిటీల జాతకాలు బహిరంగంగా చెప్పను అంటూ ఒక వీడియో విడుదల చేసాడు. ఇలా చెప్పిన రెండు మూడు నెలలకే నాగ చైతన్య, శోభిత విడాకులు తీసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ఘోరమైన నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు. మహిళా కమీషన్ కూడా ఇతన్ని వివరణ కోరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటి నుండి సైలెంట్ గా ఉన్న వేణు స్వామి, రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన ఫోన్ సంభాషణ లీకై మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఆ ఫోన్ కాల్ సంభాషణలో టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో చనిపోతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Also Read: సూర్య కూతురు ఇంటర్ మార్కుల పట్టిక చూసారా..? దిమ్మతిరగడం ఖాయం!
దీనిపై కూడా ఆయన తీవ్రమైన ట్రోలింగ్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల గురించి మాట్లాడుతూ ‘భారత్, పాకిస్తాన్ మధ్య భూమికి సంబంధించి యుద్ధం జరుగుతుందని నేను ఉగాదికి ముందే తెలిపాను. 2032 వ సంవత్సరం లోపు పాకిస్తాన్ 80 శాతానికి పైగా నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ నాయకులు, నటులు మరణిస్తారు’ అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నెటిజెన్స్ ఆయన్ని ఎప్పటి లాగానే బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కాసేపటి క్రితమే ఇండియా, పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. నువ్వు చెప్పింది ఇప్పుడు కూడా జరగలేదంటూ నెటిజెన్స్ వేణు స్వామి పై విరుచుకుపడుతున్నారు.