
దేశంలోని కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ యాప్ ఒకటనే సంగతి తెలిసిందే. యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ యాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. యూజర్ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ప్రతిఒక్కరికి మెసేజ్‌లను డిలీట్ చేసే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పొరపాటున స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్ లను నిర్ణీత సమయంలో డిలేట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ద్వారా డిలేట్ చేయవచ్చు.
ఈ ఫీచర్ సహాయంతో మెసేజ్ ను డిలేట్ చేస్తే మెసేజ్ అందుకున్న వ్యక్తికి మెసేజ్ డిలీట్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. అయితే డిలేట్ చేసిన మెసేజ్ లను కూడా సులభంగా చదవవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి “notisave” అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్‌లో ట్యాబ్‌ను డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవొచ్చు. ఈ యాప్ సహాయంతో ఫోటోలు, ఫైల్‌లు, మీడియాను కూడా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైన అన్ని పర్మిషన్లను అనుమతించి ఆటో-స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్‌లు, వాట్సాప్ మెసేజ్ లను యాప్ ట్రాక్ చేస్తుంది. మెసేజ్ ను పంపిన వారు డిలేట్ చేసినా నోటిసేవ్ యాప్ ద్వారా చదవొచ్చు. అనుకోకుండా స్వైప్ చేసిన నోటిఫికేషన్లను కూడా ఈ యాప్ ద్వారా చూసే అవకాశాలు ఉంటాయి. డిలీట్ చేసిన మెసేజ్‌లను వాట్సాప్‌లో తిరిగి పొందటానికి ఇంతకు మించి మరో మార్గం లేదనే చెప్పాలి.
మీరు చదవకూడదని భావించి ఎవరైనా మెసేజ్ లను డిలేట్ చేస్తే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు. డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను చదవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.