ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలనుకునే వాట్సాప్ యూజర్లు క్యాప్షన్ బార్ పక్కన ఉండే స్టిక్కర్ ఐకాన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్కర్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా సులభంగా ఫోటో స్టిక్కర్ గా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ను వినియోగించకుండానే సులభంగా ఈ విధంగా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ బీటా వెర్షన్ ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ లో లింక్ డివైజ్ లేదా మల్టీ డివైజ్ బీటా పేరుతో ఈ ఆప్షన్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ తో ఒకే సమయంలో నాలుగు డివైజ్ లలో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రైమరీ మొబైల్ కు ఇంట్ర్నెట్ కనెక్షన్ లేకపోయినా నాలుగు డివైజ్ లలో ఈ ఫీచర్ ను వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
14 రోజుల పాటు వాట్సాప్ ప్రైమరీ డివైజ్ నాలుగు డివైజ్ లతో అనుసంధానం కాకపోతే మాత్రం ఆటోమేటిక్ గా లాగవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా లాగిన్ అయిన వాళ్లు యాప్ లేదా డివైజ్ ల నుంచి ఒకేసారి కాల్ చేయడం సాధ్యం కాదు. గ్రూప్ లలో జాయిన్ కావడం, గ్రూప్ లను ఇన్వైట్ చేయడం కూడా సాధ్యం కాదు.