https://oktelugu.com/

WhatsApp: యూజర్లకు భారీ షాక్.. ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్!

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పాత ఫోన్లను వినియోగించే యూజర్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. 2021 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి పాత వెర్షన్ ఫోన్లను వినియోగించే వాళ్లకు వాట్సాప్ పని చేయదు. కై 2.5.1 ఓఎస్, ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ ఓఎస్ లతో పాటు పాత తరం ఓఎస్ లతో పని చేసే ఆండ్రాయిడ్, ఆపిల్, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 8, 2021 / 09:07 AM IST
    Follow us on

    WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పాత ఫోన్లను వినియోగించే యూజర్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. 2021 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి పాత వెర్షన్ ఫోన్లను వినియోగించే వాళ్లకు వాట్సాప్ పని చేయదు. కై 2.5.1 ఓఎస్, ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ ఓఎస్ లతో పాటు పాత తరం ఓఎస్ లతో పని చేసే ఆండ్రాయిడ్, ఆపిల్, ఫీచర్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నారు.

    పాత ఫోన్లను వినియోగించే వాళ్లకు నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్ డేట్లు ఫోన్లలో అప్ డేట్ కావు. వాట్సాప్ సంస్థ తాజాగా ఫోన్ మోడల్స్ జాబితాను రిలీజ్ చేసింది. వాట్సాప్ రిలీజ్ చేసిన ఫోన్ల జాబితాలో మీ ఫోన్ కూడా ఉందేమో చెక్ చేసుకుంటే మీ ఫోన్ లో వాట్సాప్ రాబోయే రోజుల్లో పని చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ తో పాటు 6ఎస్, ఎఎస్ ప్లస్ మోడల్స్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

    ఐఓఎస్ 10కు అప్ డేట్ కాని ఫోన్లలో సైతం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఓఎస్ 14 వెర్షన్ ను సపోర్ట్ చేసే మోడల్స్ ను వెంటనే అప్ డేట్ చేసుకుంటే మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్ల జాబితాలో ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్2, ఎస్3 మినీ, గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్ 2, గెలాక్సీ ఎక్స్ కవర్2 మోడల్స్ లో వాట్సాప్ నిలిచిపోనుంది.

    సోనీ ఎక్స్ పీరియా మిరో, సోనీ ఎక్స్ పీరియా నియో, సోనీ ఎక్స్ పీరియా ఆర్క్స్ ఎస్ మోడల్స్ లో వాట్సాప్ పని చేయదు. హువావే అసెండ్ జీ740, అసెండ్ డీ మరియు అసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్.ఎల్, అసెండ్ డీ2, అసెండ్ పీ1ఎస్ మోడల్స్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఓఎస్ ను అప్ డేట్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.