Whatsapp New Features 2025: వాట్సప్.. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లలో ఇది ఒక సంచలనం. మొదట్లో సందేశాలు, ఫోటోలు, వీడియోలు (కొంత నిడివి మాత్రమే) పంపడానికి అవకాశం ఉండేది. ఆ తర్వాత యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి దినదిన ప్రవర్తమానంగా వాట్సాప్ సరికొత్త రూపు సంతరించుకుంటున్నది.. ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతూ యూజర్ల మనసు దోచుకుంటున్నది. తాజాగా వాట్సప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: నెట్ ఫ్లిక్స్ లో ‘ఓజీ’ ని డామినేట్ చేసిన ‘ఇడ్లీ కొట్టు’..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల యూజర్లతో వాట్సాప్ దూసుకుపోతోంది. సరికొత్త సాంకేతికతను జోడించి యూజర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తోంది.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ అదరగొడుతోంది. తాజాగా వాట్సప్ మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.. అయితే ఇది త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.. దీనివల్ల యూజర్లకు అద్భుతమైన సాంకేతిక అనుభవం అందుబాటులోకి వస్తుంది.. వాట్సప్ త్వరలోనే యూజర్ నేమ్ ఆదారిత కాలింగ్ ఫీచర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.. దీనివల్ల యూజర్లు తమ ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే యూసర్ నేమ్ ద్వారా ఇతరులకు వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయవచ్చు.. యూజర్లు ప్రైవసీ కోసం ఈ ఫీచర్ వాడుకోవచ్చు.
కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకు.. ఇకపై నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే వీడియో కాల్.. వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ కనెక్టివిటీ పెరుగుతుందని మెటా భావిస్తోంది. పోటీ సంస్థలు భిన్న భిన్న ప్రయోగాలు చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనివల్ల విపరీతమైన పోటీ ఉంటున్న నేపథ్యంలో.. మెటా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే అప్డేట్స్ విషయంలో సరికొత్త ఫీచర్ ను మెటా అందుబాటులోకి తీసుకువచ్చింది.. చానల్స్, అధిక నిడివి ఉన్న వీడియోలు పంపుకునే అవకాశం.. కమ్యూనిటీలను సృష్టించుకునే వెసలు బాటును వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీనివల్ల యూజర్లకు మెరుగైన సాంకేతిక అనుభవం అందుబాటులోకి వస్తుందని మెటా భావిస్తోంది. వాట్సప్ ద్వారా కొన్ని దేశాలు ఈ గవర్నింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది.. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ.. యూజర్లకు అద్భుతమైన సాంకేతిక అనుభవం అందిస్తూ దూసుకుపోతున్న వాట్సప్.. భవిష్యత్తు కాలంలో ఇంకా అనేక రకాల మార్పులకు శ్రీకారం చుడుతుందని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తు కాలంలో వాట్సాప్ మనిషి నిజ జీవితంలో ఒక భాగం అవుతుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.