WhatsApp: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి మొబైల్ లో Whatapp తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ మెసేజ్లు లేదా ఇతర అవసరాల కోసం ఈ యాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ మాతృ సంస్థ Meta ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. మెసేజ్ పంపే నుంచి ప్రారంభమైన వాట్సాప్ కార్యకలాపాలు ఇప్పుడు భారీ సైజుతో ఉన్న వీడియో ఫైల్స్ కూడా పంపించుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. అయితే ఓవైపు వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలను కల్పించిన నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ను హ్యాక్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ కాంటాక్ట్స్ ప్రమాదంలో పడ్డట్లు గుర్తించారు. అసలేం జరిగిందంటే?
మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా ఏర్పడడానికి ప్రస్తుతం వాట్సాప్ యాప్ నే ప్రధానంగా ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యక్తి కలిసినప్పుడు వారి నెంబర్ను సేవ్ చేసుకుంటారు. వారికి ఏదైనా ఫైల్ పంపించాలంటే అతని నెంబర్ సేవ్ చేసుకుంటేనే వాట్సాప్ లో నెంబర్ కనిపిస్తుంది. ఇలా కావాల్సిన ఫైల్స్ ను పంపించుకుంటూ ఉంటారు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు ఇలా సేవ్ చేసుకున్న నెంబర్లను హ్యాక్ చేసినట్లు వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటాలి అని అంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ డేటాను సేకరించి ఆ తర్వాత దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఇతర మార్గాల కంటే వాట్సప్ ద్వారానే ఎక్కువగా రిస్క్ లో ఉన్నట్టు తెలిపారు. హ్యాకర్లు కేవలం అరగంటలోనే దాదాపు మూడు కోట్ల అమెరికన్ ఖాతాదారుల ఫోన్ నెంబర్లను సేకరించినట్లు వియాన్న పరిశోధకులు తెలిపారు.
అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన వియన్నా యూనివర్సిటీ పరిశోధకులకు వాట్సాప్ మాతృ సంస్థ beta కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ఈ లోపంపై వారితో కలిసి అధ్యయనం చేస్తామని వాట్సాప్ మాతృ సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే ఇలా హ్యాకర్లు వాట్సాప్ నుంచి కాంటాక్ట్స్ సేకరించినా.. వాటిని ఇప్పటివరకు ఎలాంటి దుర్వినియోగం పరచలేదని తెలిపారు. కానీ ముందు ముందు వారు ఈ నెంబర్లతో ప్రమాదాలను సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అలాంటి ప్రమాదాలు జరగకుండానే ముందుగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఈ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. దీంతో వాట్సాప్ యాజమాన్యం అప్రమత్తమై వినియోగదారుల డేటా భద్రత కోసం సరైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోసారి డేటా లీక్ కాకుండా కొత్తగా ఫీచర్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలో అత్యధికమంది వాట్సాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందువల్ల హ్యాకర్లు ఈ యాప్ పై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో వాట్సాప్ యాజమాన్య సంస్థ సైతం తమ వినియోగదారుల కోసం ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్లను అప్డేట్ చేస్తూ వస్తుంది. అయినా కూడా హ్యాకర్లు తమ కొత్త ప్రయత్నాలతో వినియోగదారుల డేటాను లీక్ చేయగలుగుతున్నారు.