WhatsApp Features : కమ్యూనికేషన్ రంగంలో ప్రధాన వాహకంగా నిలుస్తుంది WhatsApp. ప్రస్తుతం వినియోగించే ప్రతి మొబైల్ లో ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. మెసేజ్ లతోపాటు ఫోటోలు, వీడియోలు, మనీ ట్రాన్సాక్షన్ చేసుకునేందుకు వాట్స్అప్ ఇప్పుడు ఉపయోగకరంగా మారింది. అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో రకాల ఫ్యూచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఈ యాప్ మాతృ సంస్థ మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రైవసీ విషయంలో చాలా చర్యలు తీసుకుంటుంది. అయితే తాజాగా వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ వల్ల కొందరికి ఉపయోగకరంగా ఉండనుంది. అదేంటంటే?
Also Read : బాలయ్య ఆ మూవీని వదిలేస్తే నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడా..?
వాట్సాప్ లో ఉండే ఫీచర్లు దాదాపు వినియోగదారులందరినీ ఆకట్టుకుంటాయి. వీటిలో స్టేటస్ ప్రధానంగా నిలుస్తుంది. వాట్సాప్ వినియోగించేవారు తమ గురించి ఇతరులకు తెలియజేయడానికి స్టేటస్ లో తమ గురించి చెబుతూ ఉంటారు. కొందరు దేవుళ్ళ సంబంధించిన వీడియోలు పెడుతూ ఉంటారు.. మరికొందరు తమ పర్సనల్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి స్టేటస్ లతో ఎదుటివారిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో కొన్ని ముఖ్యమైన సమాచారాలను కూడా తమ వారికి తెలియజేయడానికి స్టేటస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక వ్యక్తి తన మొబైల్ నెంబర్ మీద స్టేటస్ పెట్టుకుంటే.. తమ కాంటాక్ట్స్ నెంబర్స్ మాత్రమే చూడగలుగుతారు. అలాగే ఒక వ్యక్తి స్టేటస్ లో పెట్టుకున్న వీడియోలను కాంటాక్ట్ నెంబర్స్ వారు మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉంది. కానీ కొత్తగా ఇప్పుడు ఇతరులు కూడా స్టేటస్ లోని వీడియోను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే లేటెస్ట్ మొబైల్ లో స్టేటస్ లో ఉండే వీడియో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అయితే ఇలాంటి సౌకర్యం వల్ల ఎదుటివారి ప్రవేశికి భంగం కలిగి అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కొందరు తమ పర్సనల్ వీడియోలను స్టేటస్ లో ఉంచుకుంటే.. వాటిని కొందరు తెలియని నెంబర్లు షేర్ చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ఫీచర్ గురించి సమాచారం అధికారికంగా రావాల్సి ఉంది. అంతేకాకుండా ఇలాంటి స్టేటస్ కేవలం కాంటాక్ట్స్ నెంబర్స్ కు మాత్రమే వెళ్తుందా లేక పబ్లిక్ లోకి వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది. పబ్లిక్ లోకి వెళ్తే మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
స్టేటస్ ల ద్వారా తాము ఎక్కడున్నామో? ఏం చేస్తున్నామో? తెలియజేస్తూ ఉంటారు. అయితే అయితే ఇప్పటివరకు తమ కాంటాక్ట్స్ వారికి మాత్రమే ఈ విషయం తెలవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అయితే పబ్లిక్ లోకి వెళ్తే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళల స్టేటస్లు పబ్లిక్ లోకి వెళ్తే ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు.