WhatsApp Chat Recovery 2025 Method: వాట్సప్ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లాగా అవతరించింది. సందేశాల నుంచి మొదలు పెడితే వీడియోల వరకు ప్రతిదీ దీని ద్వారానే ఇప్పుడు అందరూ పంపిస్తున్నారు. ఒకరకంగా దీనిని ప్రపంచంలో దాదాపు కోట్ల మంది వాడుతున్నారు.
వాట్సప్ అనేది అతిపెద్ద సోషల్ మెసేజింగ్ యాప్.. మన దేశంలో కొన్ని ప్రభుత్వాలు వాట్సప్ ద్వారానే అనేక సేవలు అందిస్తున్నాయి. సాధారణంగా వాట్సాప్ లో సందేశాలను డిలీట్ చేస్తే.. తిరిగి పొందడం చాలావరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం డిలీట్ ఫర్ ఆల్ అని కొట్టేస్తాం. దీనివల్ల ఆ సందేశాలు మొత్తం డిలీట్ అవుతాయి.. ఎప్పుడైనా వాటిని తిరిగి పొందాలి అనుకుంటే.. వాటిని రీ స్టోర్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించింది.. ఐ క్లౌడ్ లేదా గూగుల్ డ్రైవ్ ద్వారా దీనిని బ్యాకప్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే చాట్ తొలగించక ముందే బ్యాకప్ కనుక చేసుకుంటే.. దానిని మరలా పొందడానికి అవకాశం ఉంటుంది. దీనిని పొందడానికి ముందుగా ఫోన్లో వాట్సాప్ ను అన్ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ ను ఫోన్ నెంబర్ తో దృవీకరించుకోవాలి. ఆ సమయంలో రీస్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని వెంటనే క్లిక్ చేయాలి. ఈ విధంగా వాట్సాప్ లో ఉన్న చాట్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. సందేశాలను మొత్తం రికవరీ చేసుకోవచ్చు..
Also Read: Whatsapp Ad: ఇక వాట్సాప్ లో కూడా యాడ్స్..11ఏళ్ల తర్వాత మెటా కీలక నిర్ణయం
షరతులు వర్తిస్తాయి
సందేశాలను మొత్తం తొలగించక ముందు బ్యాకప్ చేసుకున్న సమయంలో మాత్రమే తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే తిరిగి పొందే అవకాశం ముగిసిన తర్వాత స్వీకరించిన లేదా పంపించిన సందేశాలను తిరిగి పొందడానికి అవకాశం ఉండదు. అయితే ఈ సందేశాలను తిరిగి పొందాలనుకుంటే ముందుగానే గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్ లో కచ్చితంగా తగినంత స్టోరేజ్ స్పేస్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వాట్సప్ సెట్టింగ్స్ లలో ఉండే బ్యాక్అప్ ను అనేబుల్ చేసుకుంటే సందేశాలను మొత్తం యధావిధిగా తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తొలగించిన సందేశాలను ఎప్పుడైనా సరే పొందడానికి అవకాశం ఉంటుంది.. ప్రస్తుతం ప్రతి పని కూడా వాట్సాప్ ద్వారానే జరుగుతోంది. వివిధ రకాల ధ్రువపత్రాలు కూడా దీని ద్వారానే యూజర్లకు అందుతున్నాయి. కొన్ని ప్రభుత్వాలు ఏకంగా వాట్సాప్ గవర్నింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవన్నీ కూడా కేవలం వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి.. బ్యాకప్ అనేది చాలా అవసరం. దీనికి తోడు తిరిగి సందేశాలను పొందాలనుకున్నప్పుడు కచ్చితంగా స్పేస్ ఉండేలా చూసుకోవాలి.
అయితే బ్యాకప్ అనేది తీసుకోవడం సులభమే అయినప్పటికీ.. వాట్సప్ సెట్టింగ్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందులో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా సరే తొలగించిన సందేశాలను తిరిగి పొందడం సాధ్యం కాదు. కేవలం సందేశాలు మాత్రమే కాదు ఫోటోలు వీడియోలకు కూడా ఇదే వర్తిస్తుంది. అలాంటప్పుడు ఎప్పటికప్పుడు వాట్సప్ సెట్టింగ్స్ ను పరిశీలించుకుంటూ ఉండాలి.