WhatsApp AI Integration: ఒకప్పుడు ఎలా ఉండేది.. కేవలం మెసేజ్, ఫోటోలు మాత్రమే వాట్సాప్ ద్వారా పంపించేవాళ్ళం.. కొంతకాలానికి వీడియోలు పంపించే అవకాశం కలిగింది.. ఇప్పుడు సందేశాలు.. ఫోటోలు.. వీడియోలు.. పిడిఎఫ్ ఫైళ్ళు… అంతకుమించి అనే రేంజ్ లో వాట్సాప్ ద్వారా జరిగిపోతున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే వాట్సాప్ ద్వారానే ఈ గవర్నింగ్ అనే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. కేవలం వాట్సాప్ ద్వారానే ధ్రువీకరణ పత్రాలను అందించే వెసలుబాటును తీసుకొచ్చారు. ఇక్కడితోనే వాట్సాప్ ఆగిపోవడం లేదు. అంతకుమించి అనే స్థాయిలో సదుపాయాలను కల్పిస్తోంది. సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది.
నేటి కాలంలో టెక్నాలజీ ఆధారంగానే మనిషి మనుగడ కొనసాగుతోంది.. మనిషి అవసరాలకు తగ్గట్టుగానే టెక్నాలజీ కూడా రకరకాల మార్పులకు గురవుతోంది.. గతంలో ఉన్న దానికంటే సరికొత్త అనుభూతిని కళ్ళ ముందుకు తెస్తోంది.. మనిషి అవసరాల తగ్గట్టుగానే టెక్నాలజీ అనేది సరికొత్త మార్పులకు గురవుతోంది. టెక్ నిపుణులు సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పుడు ఎలాంటి కొత్తదనం జతచేస్తారో అర్థం కావడం లేదు. కానీ మారిన టెక్నాలజీ వల్ల మనిషి జీవితం సమూల మార్పులకు గురవుతోంది.
Also Read: Link Mobile no to Driving Licence: వాహనదారులకు అలెర్ట్.. పాటించకుంటే మీ పని ఖతమే!
ప్రస్తుతం కృత్రిమ మేధ అనేది అనేక సంచలనాలకు నాంది పలుకుతోంది. అప్పటికప్పుడు ఊహాతీత దృశ్యాల నుంచి మొదలుపెడితే వీడియోల వరకు ఇలా ప్రతిదీ కృత్రిమ మేధ ద్వారా సాధ్యమవుతున్నాయి. కృత్రిమ మేధ అనేది ఎక్కడిదాకా వెళ్తుంది? ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుంది? అనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానం లభించడం కష్టం. ఎందుకంటే కృత్రిమ మేధ అన్ని రంగాలను శాసిస్తోంది. రక్షణ రంగం నుంచి మొదలుపెడితే వైద్యరంగం వరకు ప్రతి దాంట్లో కృత్రిమ మేధ అడుగుపెట్టింది. సంచలనాలు సృష్టిస్తోంది.. ఇప్పటికే పలు దేశాలు యుద్ధాలలో కృత్రిమ మేధ ద్వారా పనిచేసే ఆయుధాలను, క్షిపణులను వాడుతున్నాయి.
కృత్రిమ మేధ ద్వారా పనిచేసే అసిస్టెంట్ ను ఇప్పుడు వాట్సాప్ లోకి ప్రవేశపెట్టారు. అయితే ఇదేదో మెటా ఏఐ రూపొందించింది కాదు. ఇది పూర్తిగా మన దేశానికి చెందిన ఏఐ అసిస్టెంట్. దీనిని పుచ్ ఏఐ అని పిలుస్తున్నారు. మన దేశాన్ని చెందిన కృత్రిమ మేధ అని పనులు సిద్ధార్థ బాటియా, అర్జిత్ జైన్ రూపొందించారు. దీనివల్ల సాంకేతిక నైపుణ్య లేని వారు కూడా సులభంగా వాట్సాప్ వాడొచ్చు. తెలుగు నుంచి మొదలు పెడితే తమిళం వరకు దాదాపు 22 కి పైగా భారతీయ భాషలలో సంభాషించవచ్చు. ఇది వాట్సాప్ ఆధారిత మల్టీ లింగ్వల్ ఏఐ అసిస్టెంట్. దీని ద్వారా తప్పుడు సమాచారాన్ని గుర్తించవచ్చు. క్రికెట్ స్కోర్ తెలుసుకోవచ్చు. రైళ్ల గమనాన్ని తెలుసుకోవచ్చు. ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. చివరికి వంట కూడా చేయవచ్చు . మనదేశంలో ఇప్పటికి నిరక్షరాస్యులు ఉన్న నేపథ్యంలో.. వారిని దృష్టిలో పెట్టుకొని ఈ అసిస్టెంట్ ను రూపొందించారు.