Whatsapp Hack : ప్రస్తుత కాలంలో ప్రతీ మొబైల్ లో Whatsapp తప్పనిసరిగా ఉంటుంది. మెసేజ్ నుంచి ముఖ్యమైన ఫైల్స్ పంపించుకోవడానికి ఇప్పుడు వాట్సాప్ ప్రధానంగా నిలుస్తుంది. ఒకప్పుడు మెయిల్ ద్వారా సమాచారం, ఫైల్స్ సెండ్ చేసేవారు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా క్షణాల్లో వాట్సాప్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీంతో స్కూల్ విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు సైతం వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ ను యూజ్ చేసే క్రమంలో ఒక్కోసారి హ్యాక్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి తెలియకుండానే తన వాట్సాప్ ఖాతాను వేరేవారు ఓపెన్ చేస్తారు. దీనిని గుర్తించడం ఎలా? అలా వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ప్రపంచంలో ఉన్న వ్యక్తులను వాట్సాప్ కనెక్ట్ చేస్తుంది. వాట్సాప్ యూజర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. దీంతో దీని మాతృసంస్థ అయిన మెటా రోజుకో అప్డేట్ ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తూ అవసరాలను తీరుస్తుంది. ఒకప్పుడు మెసేజ్ మాత్రమే పంపించేకునే సదుపాయం ఉండేది. కానీ ఈప్పుడు హెచ్ డీ ఫొటోలతో పాటు క్వాలిటీ వీడియోలు కూడా సెండ్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు మనీ ట్రాన్స్ ఫర్ కూడా వాట్సాప్ ద్వారా చేయొచ్చు. ఇన్ని సదుపాయాలున్న వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండలేదని చెప్పలేం.
అయితే వ్యాట్సాప్ హ్యాక్ అయిందో లేదో ముందుగా గుర్తించాలి. అనుకోకుండా లాగిన్ పాస్ వర్డ్ మెసేజ్ వచ్చినా.. ఓటీపీ వచ్చినా.. వాట్సాప్ ను ఇంకొకరు యూజ్ చేస్తున్నారని అనుకోవాలి. అలాగే వాట్సాప్ లోని లింక్డ్ డివైజ్ ఆప్షన్ లో ఎన్ని డివైజ్ లు కనెక్ట్ అయి ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రస్తుతం వాడుతున్న దానికంటే ఎక్కువగా ఉంటే వెంటనే దానిని డిసేబుల్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్ మూడు చుక్కులు ఉంటాయి. వీటిపై క్లిక్ చేయగానే ఇందులో లింక్డ్ డివైజ్ అప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఎన్ని డివైజ్ లు ఉన్నయో అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి.
వాట్పాప్ హ్యాక్ కాకుండా ఉండాలంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఉన్న 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఒకే చేసుకోవాలి. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఓకే చేసినట్లు వేరే ఎవరికీ చెప్పకూడదు. దీనిని ఎనేబుల్ చేసుకున్న తరువాత ఎప్పుడు వాట్సాప్ ఆతర డివైజ్ తో లింక్ చేసుకున్నా 2 స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది. దీంతో సేఫ్ గా ఉండొచ్చు.
అదీ కాకుండా వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మెసేజ్ లు చెక్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ మెసెస్ సెండ్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఎప్పుడు చూశాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ సమయాల్లో తేడా ఉంటే వాట్సాప్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. సాధ్యమైనంత వరకు వాట్సాప్ ను లాగౌట్ చేస్తూ లాగిన్ అవుతూ ఉండాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More