Facebook Whatsapp: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు ఎందుకు ఆగిపోయాయి? కారణాలేంటి?

Facebook Whatsapp: ఫేస్ బుక్ లో పోస్టు చేయనిదే.. వాట్సాప్ లో స్టేటస్ పెట్టనిదే నిద్ర పోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. కానీ ఆ రెండూ ఆగిపోవడంతో జనాలు విలవిల లాడారు. తట్టుకోలేకపోయారు. కానీ ‘శృతి హాసన్’ లాంటి స్టార్ హీరోయిన్ మాత్రం ‘ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్’ ఆగిపోవడం హాయిగా ఉందని ప్రశాంతంగా నిద్ర పోతున్నానని పేర్కొంది. నిజంగానే మన చిన్నప్పుడు ఈ ఫోన్లు, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటివి […]

Written By: NARESH, Updated On : October 5, 2021 9:10 am
Follow us on

Facebook Whatsapp: ఫేస్ బుక్ లో పోస్టు చేయనిదే.. వాట్సాప్ లో స్టేటస్ పెట్టనిదే నిద్ర పోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. కానీ ఆ రెండూ ఆగిపోవడంతో జనాలు విలవిల లాడారు. తట్టుకోలేకపోయారు. కానీ ‘శృతి హాసన్’ లాంటి స్టార్ హీరోయిన్ మాత్రం ‘ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్’ ఆగిపోవడం హాయిగా ఉందని ప్రశాంతంగా నిద్ర పోతున్నానని పేర్కొంది.

నిజంగానే మన చిన్నప్పుడు ఈ ఫోన్లు, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటివి ఏం లేవు. సరదాగా ఆడుకునేవాళ్ల, పాడుకునేవాళ్లం.. చెరువులు, కుంటలు, సమీప పొలాల్లో సేదతీరేవాళ్లం.. కానీ ఈ ఆధునిక యాప్ లు వచ్చేశాక మనిషి జీవితమే మారిపోయింది. వాటికే అంకితం అవుతున్న పరిస్థితి నెలకొంది.

ఊళ్లల్లో అందరూ ‘అన్న, తాత, బావ, అక్క, తమ్ముడు’ కులాలు వేరైనా ఆప్యాయంగా పిలుచుకునేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో హాయ్ లు.. ఫేస్ బుక్ లో సమాచారాన్ని చేరవేస్తున్న దుస్థితి. ఇవన్నీ నిన్న రాత్రి 9 గంటలకు భారత్ లో ఆగిపోవడంతో కొందరు ప్రాణం పోయినట్టు విలవిలలాడగా.. చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. ఉపశమనం చెందారు.

ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సర్వీసులు బుధవారం ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. పోస్టులు, ఫొటోలు అప్ లోడ్, ఫీడ్, వీడియోలు తదితర ఫీచర్లలో సమస్యలు ఎదురయ్యాయి. ఏవీ పనిచేయకపోవడంతో అందరూ ట్విట్టర్ లో ట్వీట్లతో హోరెత్తించారు. ప్రపంచంలోనే మేజర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ మూడు బ్రేక్ కావడంతో జనం గగ్గోలు పెట్టాడు. ఇలా జరగడం ఏడాదిలో ఇది మూడోసారి..

-మూడు సోషల్ మీడియాలు ఎందుకు బ్రేక్ అయ్యాయి?

రోటీన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ లో భాగంగా ఓ చిన్న సమస్య తలెత్తిందని.. అందుకే అప్ లోడింగ్, పోస్టింగులు ఆగిపోయాయని ఫేస్ బుక్ తెలిపింది. మార్చి నెలలో ఓ ఫేస్ బుక్ సర్వర్ కాన్ఫిగరేషన్ మారిపోయి చాలా సేపు సేవలు నిలిచిపోయాయి.

-హెవీ లోడింగ్ యే కారణమా?
ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కు 230 కోట్ల మంది వినియోగదారులున్నారు. వీళ్ల డేటాను ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఫేస్ బుక్ డేటా సెంటర్లలో నిర్వహిస్తోంది. కాబట్టి వీళ్లందరికీ ఒకేసారి సర్వీసులు ఆగిపోవడం అసాధ్యం. ఫేస్ బుక్ లో మార్పులు ఒకేసారి చేయరు. ప్రాంతాల వారీగా చేస్తుంటారు. ఇలా చేసేటప్పుడే అప్పుడప్పుడు బ్రేకింగ్ జరుగుతుంది. దీంతో ఆయా దేశాల్లో సర్వీసులు ఇలా నిలిచిపోతుంటాయి. బుధవారం కూడా అలానే జరిగింది.

-వందల కోట్ల మంది.. బ్రేకింగ్స్ భవిష్యత్తులోనూ..
వందల కోట్ల మంది వినియోగదారులను ఒకేసారి మేనేజ్ చేయడం కంపెనీలకు పెనుభారం అవుతోంది. ఇప్పుడిప్పుడే ఇలాంటి సమస్యలపై అప్రమత్తంగా ఉంటున్నాయి. దీనికోసం థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. చిన్న లోపాలు వచ్చినా లక్షల మంది యూజర్లకు సేవలు నిలిచిపోతున్నాయి. గగ్గోలు పెడుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా కంపెనీలు నిర్వహణలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది.