whatsapp instagram facebook down: ఆగిపోయిన ఫేస్ బుక్, వాట్సాప్.. వినియోగదారుల గగ్గోలు

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఏమయ్యాయో.. ఎందుకు అయ్యిందో తెలియదు.. కానీ ఒక్కసారి రాత్రి 9 గంటల తర్వాత ఈ సేవలు ఆగిపోయాయి. భారత దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు యూజర్లు ఏం జరుగుతుందో తెలియక ఇతర సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్ లో పోస్టులు వెల్లువెత్తుతున్నారు. కాగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ […]

Written By: NARESH, Updated On : October 4, 2021 9:41 pm
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఏమయ్యాయో.. ఎందుకు అయ్యిందో తెలియదు.. కానీ ఒక్కసారి రాత్రి 9 గంటల తర్వాత ఈ సేవలు ఆగిపోయాయి.

భారత దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు యూజర్లు ఏం జరుగుతుందో తెలియక ఇతర సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్ లో పోస్టులు వెల్లువెత్తుతున్నారు.

కాగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఆగిపోవడంపై దాని మాతృసంస్థ ‘ఫేస్ బుక్’ స్పందించింది. ఈ సమస్యను గుర్తించామని.. పనిచేస్తున్నామని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

కాగా ఈ మూడు సోషల్ మీడియాలు ఆగిపోవడానికి గల అసలు కారణాలు వెల్లడి కాలేదు. హ్యాకింగ్ జరిగిందా? సర్వర్ పడిపోయిందా? మరేం కారణాలు అన్నది తెలియాల్సి ఉంది. ఫేస్ బుక్ మాత్రం సమూస్య పరిష్కారానికి పనిచేస్తున్నామని తెలిపింది.