Homeవింతలు-విశేషాలుwater reacts to human emotions: నీటికి కూడా ఎమోషన్ ఉంటుందా? ఈ శాస్త్రవేత్త ఎలా...

water reacts to human emotions: నీటికి కూడా ఎమోషన్ ఉంటుందా? ఈ శాస్త్రవేత్త ఎలా నిరూపించాడు?

water reacts to human emotions: నీరు లేకపోతే ప్రపంచమే తలకిందులు అవుతుంది. సర్వకోటి ప్రాణికి నీరే ప్రధానం. భూమి మొత్తంలో మూడు వంతుల నీరు ఉంటే.. ఒక భాగం మాత్రమే నేలను కలిగి ఉంది. అలాంటి నీరు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఎలాంటి మలినాలనైనా నీరు కడిగిపారేస్తుంది. ఎంతటి అశుభ్రత ఉన్నా నీటితో శుభ్రంగా మార్చుకోవచ్చు. ఇలాంటి నీటికి స్పందించే గుణం ఉందంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ ఇది కేవలం మాటలతోనే కాకుండా పరిశోధనలు చేసి నిరూపించాడు జపాన్ కు చెందిన శాస్త్రవేత్త. మనుషుల నెగటివ్, పాజిటివ్ మాటలకు నీరు స్పందిస్తుందని ఆ శాస్త్రవేత్త నిరూపించాడు. ఇంతకీ మనుషుల మాటలకు నీరు ఎలా స్పందిస్తుంది? దీనిని నిరూపించిన ఆ శాస్త్రవేత్త ఎవరు?

ఉదయం నుంచి రాత్రి వరకు నీరు తాగకుండా ఎవరూ బతకలేరు. మనసులు మాత్రమే కాకుండా ఇతర ప్రాణులు సైతం నీటితోనే ప్రాణాలను నిలుపుకుంటాయి. అయితే నీరు కేవలం మానవుల అవసరాల కోసం మాత్రమే కాకుండా దానికి కూడా స్పందించే గుణం ఉంటుందని నిరూపించారు. జపాన్ కు చెందిన Masaru Emato అనే శాస్త్రవేత్త నీరు మంచి మాటలను, చెడు మాటలను గుర్తిస్తుందని నిరూపించారు. ఆయన పరిశోధనలో భాగంగా రెండు వాటర్ బాటిలను తీసుకున్నాడు. రెండిటిని ఒకే రకమైన నీటితో నింపాడు. ఇందులో ఒక ఒక బాటిల్ తో వారం రోజులపాటు మంచిగా మాట్లాడుతూ స్వచ్ఛమైన మ్యూజిక్ను వినిపించాడు. మరో బాటిల్తో నెగటివ్ గా మాట్లాడుతూ.. హార్డ్ మ్యూజిక్ను వినిపించాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ బాటిల్లోని నీరుని వేరువేరుగా మైక్రోస్కోప్లో వేసి పరిశీలించారు.

Also Read: Harvard University: దేవుడికి, సైన్స్, గణితానికి ఏంటి సంబంధం.. హార్వర్డ్ పరిశోధనలో ఏం తేలింది?

ఇందులో మంచి మాటలు విని.. అందమైన మ్యూజిక్ విన్న బాటిల్లో పువ్వుల వలె కొన్ని ఆకారాలు కనిపించాయి. అలాగే నెగటివ్ మాటలు విని.. భారీ శబ్దంతో ఉన్న మ్యూజిక్ను విన్న బాటిల్లో కంజీ లాంటి ఆకారం కనిపించింది. దీంతో ఆ శాస్త్రవేత్త నీటికి కూడా స్పందించే గుణం ఉందని నిరూపించాడు. అయితే కొందరు శాస్త్రవేత్తలు దీనిని ఒప్పుకోలేదు. కానీ ఆయన తన పరిశోధనల గురించి రాసిన The Hidden Message In Water అనే పుస్తకం న్యూయార్క్ లో ఎక్కువగా అమ్ముడుపోయింది. మాసారు ఏమోటో ఈ పరిశోధనకు The Emotion Of Water అని పేరు పెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది

మానవ శరీరంలో కూడా 60% నీరు ఉంటుంది. ఈ నీరు స్వచ్ఛమైన మ్యూజిక్ తో పాటు.. మంచి మాటలు, చెడు మాటలు వింటుంది.. అయితే పాజిటివ్ గా మాట్లాడితే శరీరం సమతుల్యంగా ఉంటుందని.. మంచి ఆలోచనలు వస్తాయని ఈ పరిశోధనలు బట్టి తెలుస్తుందని కొందరు చెబుతున్నారు. నెగిటివ్ గా మాట్లాడుతూ చెడు వాతావరణంలో ఉండడం వల్ల నిత్యం ఆందోళనకారంగా ఉంటారని దీని ద్వారా చెప్పవచ్చని అంటున్నారు. మానవ శరీరంలో ఉండే నీటి వల్ల ఆలోచనలు కూడా మారిపోతాయని కొందరు మాసారో ఎమటో పరిశోధనలకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ పరిశోధనలు కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా మాసారో ఏంటో పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular