https://oktelugu.com/

Artificial intelligence camera : ఫుల్లుగా మద్యం తాగారా?.. పోలీసులకు పట్టుబడకుండా వచ్చేసారా?.. సేఫ్ అని పొరపడకండి.. ఎందుకంటే

ఈ రోజుల్లో చాలామంది మద్యం తాగడాన్ని స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా నగరాలలో జీవించేవారు శని, ఆదివారాలలో ఫుల్లుగా తాగేస్తున్నారు. అయితే అందరూ తాగుబోతులని చెప్పడం మా ఉద్దేశం కాదు. కాకపోతే తాగడం అనేది స్టేటస్ సింబల్ గా మారిపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 18, 2024 / 10:07 PM IST

    Artificial intelligence camera

    Follow us on

    Artificial intelligence camera :  మద్యం తాగిన వాళ్ళు ఊరికే ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. వాళ్లు తమ వాహనాలతో రోడ్లమీదకి వచ్చి చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇదే సమయంలో వారి వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు లెక్కేలేదు. గత కొంతకాలంగా మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ ప్రమాదాలలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం.. లేదా గాయపడడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో సింహభాగం మద్యం తాగి వాహనాలను నడపడం వల్లే చోటు చేసుకుంటున్నాయని తేలింది. అందువల్లే రోడ్లపై నిఘాను ముమ్మరం చేసింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై ఎప్పటికప్పుడు భద్రతను కట్టు దిట్టం చేసింది. కృత్రిమ మేథ ద్వారా నడిచే కెమెరాలను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా వాహనాలను తనిఖీ చేయడం సులభం అవుతుంది. ఈ కెమెరాలు డ్రైవర్ స్థితి ఏమిటనేది ఎప్పటికప్పుడు చెబుతుంటాయి. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందిస్తాయి. కెమెరాలు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు సంబంధిత డ్రైవర్ ను ఆపి తనిఖీ చేస్తారు. తాగి వాహనాలు నడుపుతున్న వారికి ఫైన్ విధిస్తారు.. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. మోడ్రన్ హెడ్సెప్ డివైస్ ద్వారా ఈ కెమెరాను తయారు చేశారు.

    బ్రిటన్ పోలీసులు తొలిసారిగా..

    బ్రిటన్ పోలీసులు తొలిసారిగా ఈ కెమెరా ను ఉపయోగించారు. అయితే ఈ కెమెరాలు బయటికి పెద్దగా కనిపించవు. వీటిని ఆక్యు సెన్సస్ అనే సంస్థ రూపొందించింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిన వారిని ఈ ఏఐ కెమెరాలు సులువుగా గుర్తిస్తాయి. మీరు మాత్రమే కాకుండా మాదకద్రవ్యాలు తీసుకొని వాహనాలు నడిపే వారిని కూడా ఇవి గుర్తిస్తాయి. చివరికి సీట్ బెల్ట్ ధరించకుండా, హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపే వారిని కూడా పసిగడతాయి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్లే ఇటువంటి కెమెరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ” పోలీసులు అన్నిచోట్లా ఉండడం కష్టం. కాపలా కాయడం మరింత కష్టం. అందువల్లే ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి. ప్రయాణికులకు సాఫీగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కెమెరాల వల్ల మందుబాబులు తాగి డ్రైవింగ్ చేయడాన్ని మానుకుంటారు. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయని” అక్యు సెన్సెస్ కంపెనీ నిపుణులు చెబుతున్నారు.