Viral video : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన విద్వంసం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కలెక్షన్స్ పరంగా ఇది రా మా తెలుగోడి సత్తా అనే రేంజ్ వసూళ్లను రాబట్టి బాలీవుడ్ హీరోలకు ముచ్చమటలు పట్టించింది. మొదటి వారంలో ఒక తెలుగు కమర్షియల్ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని మనం ఎప్పుడైనా ఊహించామా?, కానీ అల్లు అర్జున్ కసికి ఆడియన్స్ దాసోహం అయిపోయారు. రామేశ్వరం నుండి కన్యాకుమారి వరకు బాక్స్ ఆఫీస్ ఒక మోత మోగించి వదులుతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వెళ్లి చూడాలనిపించేలా చేసింది సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర సన్నివేశం. ఈ సన్నివేశం లో అల్లు అర్జున్ అద్భుతమైన నటన, దేవి శ్రీప్రసాద్ మతి పోగొట్టే మ్యూజిక్ ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది.
వయస్సుతో సంబంధం లేదు ప్రతీ ఒక్కరు ఈ సన్నివేశానికి థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని అసలు వదలడం లేదు. ప్రతీ రోజు స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే చూసిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్ అల్లు అర్జున్ ని కలిసి అతని పాదాల వద్ద మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన భర్త ఒక ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తి, అతని ప్రతిభకి ఆస్కార్ కూడా వచ్చి చేరింది, అలాంటి వ్యక్తి సతీమణి ఇలా అల్లు అర్జున్ కి దండం పెట్టడం అంటే ఆయన సాధించిన 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా ఈ ఘటన ముందు తేలిపోవాల్సిందే. ఎంతమందికి వస్తుంది చెప్పండి ఇలాంటి అదృష్టం?.
కచ్చితంగా అల్లు అర్జున్ కి రెండవ నేషనల్ అవార్డు రావడం తథ్యం అని బాలీవుడ్ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. ఇంకా నేషనల్ అవార్డు వద్ద ఆగితే అల్లు అర్జున్ కి అవమానమని, ఆస్కార్ అవార్డ్స్ కి గట్టిగా ప్రయత్నం చేయాలనీ సలహా ఇస్తున్నారు. మరి ఆయన స్థాయిని ఈ చిత్రం అక్కడి దాకా తీసుకెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రతీ చిత్రానికి దర్శకుడికి ఎంతో కొంత క్రెడిట్ రావడం అనేది సహజం. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, పుష్ప 2 చిత్రానికి కేవలం అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుకోవడమే కానీ, సుకుమార్ ఏమి తీసాడు రా సినిమా అని ఒక్కరి నోటి నుండి కూడా రాలేదు. ఆ రేంజ్ లో అల్లు అర్జున్ ఈ సినిమాని తన భుజాలపై మోశాడు. కాబట్టి కచ్చితంగా అతని నటనకి తగ్గ అవార్డ్స్ వస్తాయి.
Lyricist @boselyricist ‘s Wife Suchitra Chandrabose
After Watching @PushpaMovie ( For His Extraordinary Acting I Bow O My Knees) @alluarjun anna you are True star performer of India ❤️❤️#Pushpa2TheRule pic.twitter.com/GIWVZQyRuT
— y ⃝̶̶ sh (@yaswanth___AA) December 18, 2024