WhatsApp: వాట్సాప్ యూజర్లకు మాతృసంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఈ యాప్ ను ఎప్పటికప్పడు అప్డేట్ చేస్తూ వినియోగదారులకు సౌకర్యంగా ఉంటోంది. ఇటీవల ఫొటోస్, వీడియోస్ క్వాలిటీ తగ్గించకుండా పంపించే ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో వినియోగదారుల రక్షణ కోసం కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ చాట్ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్ తెలుసుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల వినియోగదారుల డేటా మొత్తం తెలిసిపోతుంది. అయితే దీని రక్షణ కోసం వాట్పాప్ కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకుండా ఉండలేరు. ఏ రంగంలోని వారైనా వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తగా కోట్ల మంది వాట్సాప్ లో కనెక్ట్ అయి ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న మెసెజ్ లు, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ వాట్సాప్ ద్వారా క్షణంలో పంపిస్తున్నారు. ఒక దశలో వాట్సాప్ లేకుండా కొన్ని రంగాల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
ఇదే సమయంలో వాట్సాప్ యూజర్లకు హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మాతృసంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్స్ ను అప్డేట్ చేస్తుంది. తాజాగా వినియోగదారుల డేటా చోరీ కుండా సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్ ఆడియో లేదా వీడియో కాల్ చేసినప్పుడు వినియోగదారలు ఐపీ అడ్రస్ తెలుసుకునే ప్రమాదం ఉంది
అయితే ఇలాంటి అవకాశం లేకుండా తాజాగా ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్’ అనే సెట్టింగ్స్ మార్చుకునే సదుపాయాన్ని తెచ్చింది. వాట్సాప్ లోని సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లి.. ప్రైవసీ అనేదానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అడ్వాన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ అనే దానిని ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీరు ఎవరితో మాట్లాడినా మీ మొబైల్ ఐపీ అడ్రస్ ను తెలుసుకోలేరు.