Homeఎంటర్టైన్మెంట్Chandra Mohan Passed Away: అప్పట్లో చంద్రమోహన్ పక్కన చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే...

Chandra Mohan Passed Away: అప్పట్లో చంద్రమోహన్ పక్కన చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే…

Chandra Mohan Passed Away: తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. అత్యంత ప్రతిభగల నటుడుగా గుర్తింపు పొందిన చంద్రమోహన్ గారు అనారోగ్య కారణంతో ఈరోజు అపోలో హాస్పిటల్ లో తన తుది శ్వాస విడిచి అందరిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారు…

ఇక చంద్రమోహన్ గారి సినీ ప్రస్థానం గనక ఒకసారి చూసుకున్నట్లయితే దర్శకుడు కె విశ్వనాథ్ గారి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చంద్రమోహన్ మంచి నటుడుగా గుర్తింపు పొందడమే కాకుండా హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి సక్సెస్ సాధించి తన నటన తో ప్రేక్షకులందరిని మెప్పించాడు…
ఆయన నటన సహజంగా ఉంటుంది ఆయన నటిస్తే అసలు నటించినట్టుగా కూడా అనిపించదు అంత నేచురల్ గా నటించే నటులు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు. అందులో చంద్రమోహన్ గారు మొదటి స్థానం లో ఉంటారు…

ఇక ఈయన కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. మొదట రంగుల రాట్నం సినిమాతో ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ చేశారు… మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ లో ఈయనకి వరుసగా ఆఫర్లు వచ్చాయి అయిన కూడా ఆయన సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో హీరో గా 175 సినిమాల్లో నటించి అప్పటి హీరోలకి పోటీ ఇచ్చాడు…ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఆయన ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందేది అందుకే చంద్రమోహన్ ని అందరూ లక్కీ హ్యాండ్ అంటూ పిలుస్తూ ఉండేవారు…ఇక విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సిరిసిరి మువ్వ సినిమాతో జయప్రద హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో జయప్రద ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది…ఇక ఆ హిట్ తో ఆమె అప్పుడు ఎన్టీయార్ సరసన అడవి రాముడు, యమగోల లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది….

ఇక అందాల తార గా గుర్తింపు పొందిన అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూడా పదహారేళ్ళ వయసు అనే సినిమాలో చంద్రమోహన్ పక్కన హీరోయిన్ గా నటించి తెలుగు లో మొదటి సక్సెస్ అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె ఎన్టీయార్ తో వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఇక అప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీయార్, నాగేశ్వర రావు, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరో లా పక్కన నటించి కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో తన హవా ను కొనసాగించింది…

ఇక ఇలాగే ప్రతిఘటన సినిమాతో విజయశాంతి చంద్రమోహన్ తో నటించింది. ఇక ఆ తర్వాత తను కూడ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది…ఇక వీళ్ళు అనే కాదు జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ లాంటి వాళ్ళు కూడా చంద్రమోహన్ పక్కన నటించి స్టార్ హీరోయిన్లు గా ఎదిగారు…

ఇక ఇది ఇలా ఉంటే చంద్రమోహన్ కి చందమామ రావే సినిమాలో చేసినందుకు గాను ఉత్తమ నటుడు గా నంది అవార్డ్ వచ్చింది. ఇక అలాగే కళ్యాణ్ రామ్ హీరో గా వచ్చిన అతనొక్కడే సినిమాలో ఉత్తమ సహాయ నటుడుగా కూడా ఆయన కి నంది అవార్డ్ వచ్చింది.ఇక ఏది ఏమైనా ఒక ఒక లెజెండరీ నటుడు ఇండస్ట్రీ ని వదిలేసి వెళ్లిపోవడం అనేది నిజంగా భాదకరమైన విషయం…ఇక ఈయన మరణం ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular