Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష యానం మొదలైంది. ఇప్పటికే రెండుసార్లు వెళ్లి వచ్చిన సునీతా.. మూడో సారి వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. అయితే రాకెట్‌లో సాంకేతిక లోపంతో రెండుసార్లు యాత్ర వాయిదా పడింది. చివరకు మూడో ప్రయత్నం సక్సెస్ అయింది. యాత్ర మొదలైంది. మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. 25 గంటల్లో అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు చేరుకుంటారు.
14న భూమికి..
ఐఎస్‌ఎస్‌లో సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్‌మోర్ వారం రోజులు ఉంటారు. స్టార్ లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే జూన్ 14న తిరిగి భూమిని చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మొదలైంది. ఈ మిషన్‌కు సునీతా పైలట్‌గా, విల్‌మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.
మూడోసారి ఐఎస్‌ఎస్‌కు..
ఇదిలా ఉంటే.. సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చేయడం ఇది మూడోసారి. 2006లో, 2012లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేశారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథన్ పూర్తి చేశారు.
1998లో వ్యోమగామిగా..
సునీతావిలిమయ్స్ అమెరికా నావికాదళంలో పనిచేశారు. నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. బోయింగ్ క్రూ ప్లైట్ టెస్ట్ మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేకలకు క్రాఫ్ట్ సిద్ధమైంది.
బోయింగ్ కంపెనీ తయారీ..
ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్టను బోయింగ్ కంపెనీ డెవలప్ చేసింది. మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష ప్రయోగ వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలను తయారు చేసే తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు్కక్కింది. తాజా ప్రయోగంతో రెండు ప్రైవేటు సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More