Sunita Williams: భారతీయ మూలాలు ఉన్న సునీతా విలియమ్స్ అమెరికాలో స్థిరపడింది. వ్యోమగామిగా ఎన్నో రికార్డులను సృష్టించింది. నాసా చేసిన అనేక ప్రయోగాలను ఆమె ముఖ్య భూమిక పోషించింది. గత ఏడాది ఓ ప్రయోగం నిమిత్తం అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత.. చాలా రోజులపాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. చివరికి భూమ్మీదికి చేరుకుంది. అంతటి విపత్కర పరిస్థితిల్లో కూడా ఆమె ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. పైగా అంతరిక్షంలో విస్తృతమైన ప్రయోగాలలో తన వంతు పాత్ర పోషించింది.
నాసాలో కీలకమైన పాత్రలు పోషించిన సునీత విలియమ్స్ రిటర్మెంట్ ప్రకటించారు. 27 సంవత్సరాలుగా ఆమె నాసాలో పనిచేస్తున్నారు. నాసా చేసిన అనేక ప్రయోగాలలో ఆమె కీలక పాత్ర పోషించారు. కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో కీలకమైన ప్రయోగాలలో ముఖ్య భూమిక పోషించారు. అంతరిక్షంలో 608 రోజులపాటు గడిపిన వ్యోమగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. మొత్తం తొమ్మిది పర్యాయాలలో ఆమె 62.06 గంటల పాటు స్పేస్ వాక్ చేసి.. రికార్డు సృష్టించారు.
సునీతా విలియమ్స్ సుదీర్ఘకాలం నాసాలో పనిచేశారు. ఎన్నో ప్రయోగాలలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే ఆమె వయసు ఐదుపదుల ను దాటిపోయింది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. దీంతో ఇకపై ఆమెకు ఆ స్థాయిలో ఓపిక లేకపోవడంతో రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆమె శునకాల పెంపకం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆమె కొన్ని రకాల కుక్కను పెంచుకుంటున్నారు. వాటి ఆలనా పాలన కూడా చూసుకుంటున్నారు.
గతంలో ఆమె అంతరిక్షంలో ఉన్నప్పుడు భర్త, పిల్లలతోపాటు శునకాలతో కూడా మాట్లాడటం విశేషం. భారతీయ మూలాలు ఉన్న సునీత విలియమ్స్ ఎన్నడు కూడా మాతృదేశాన్ని మర్చిపోలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ భారతీయతను అమెరికాలో చాటిచెప్పే ప్రయత్నం చేశారు. సునీత విలియమ్స్ రిటర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో నాసా కీలక ప్రకటన చేసింది. 27 ఏళ్ల పాటు నాసాలో ఆమె కీలక సేవలు చేశారని కొనియాడింది