Trivikram and Allu Arjun : ఆర్య సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైద్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఆయన పుష్ప 2(pushpa 2) సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన స్టార్ హీరో మరొకరు లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రకంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చాడు అంటూ మరికొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా… క్యారెక్టర్ ఏంటంటే..?
నిజానికి అల్లు అర్జున్ స్టార్ అవ్వడం కి త్రివిక్రమ్ చాలా కీలక పాత్ర వహించాడు. అతనితో మూడు సినిమాలు చేసి మూడు సినిమాలను కూడా సూపర్ సక్సెస్ గా నిలిపిన ఘనత త్రివిక్రమ్ కే దక్కుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించకపోవడాన్ని చూస్తున్న త్రివిక్రమ్ అభిమానులు అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు.
ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ లేదు. కేవలం ఆ ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ వేరే డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం టాప్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే అల్లు అర్జున్ తో సినిమాలు చేసి అతన్ని స్టార్ హీరోగా మార్చాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ పట్ల కృతజ్ఞత భావాన్ని చూపించాల్సిన అవసరమైతే వచ్చింది. మరి అట్లీతో సినిమా చేసిన తర్వాత అయిన త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి… ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చేశాడు. కానీ ఇప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలను చేసి మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : త్రివిక్రమ్ ఈ ఒక్కటి మార్చుకుంటే అల్లు అర్జున్ తో చేసే సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందా..?