Sunita Williams: సునీత విలియమ్స్ (Sunita Williams) అక్కడే ఉండి పోవడంతో అంతరిక్షంలో జరిగిన పరిణామాలు ప్రపంచం మొత్తాన్ని ఉత్కంఠకు గురిచేశాయి. వాస్తవానికి సునీత విలియమ్స్ స్పేస్ వాక్ (Sunita Williams stuck in space) కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి కావాలి. కానీ దీనికోసం ఏకంగా 9 నెలల సమయం పట్టింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సునీత తిరిగి భూమ్మీదికి చేరుతుందా? అది ఇప్పట్లో సాధ్యమవుతుందా? అంతరిక్షంలో ఉన్న సునీత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఆమె ఆరోగ్యానికి ఏమైనా సవాళ్లు ఎదురవుతున్నాయా? అనే ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి. చివరికి ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో నింగిలోకి వ్యోమ నౌకను పంపించారు. అది ఇక్కడి నుంచి వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపించి.. అక్కడి నుంచి సునితా విలియమ్స్, విల్ మోర్ ను భూమి మీదకు తీసుకొచ్చింది. సునీత విలియమ్స్, విల్ మోర్ భూమ్మీదకి వచ్చిన క్షణాలను నాసా తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది.
సునీత తదుపరి ప్లాన్ ఏంటంటే
సునీత విలియమ్స్ సున్నిత మనస్కురాలు. ఆమెకు శునకాలు అంటే చాలా ఇష్టం. అమెరికాలో ఆమె వద్ద లాబ్రడార్ జాతికి చెందిన రెండు శున కాలు ఉన్నాయి. సునీత భర్త మైకేల్ (Sunita Williams husband) వాటి బాగోగులు చూసుకుంటున్నారు. భర్త మైకేల్ తో కలిసి కుక్కలను వెంటపట్టుకుని బయటకు వెళ్లడం.. వ్యాయామం చేయడం సునీతకు చాలా ఇష్టం. సునీతకు కార్లు, విమానాలకు రిపేర్లు చేయడం అంటే చాలా ఇష్టం. భర్తతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడం.. ఇంట్లో వంట పని చేయడాన్ని ఆమె అమితంగా ఇష్టపడుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత రెండు కుక్కలతో లాంగ్ వాక్ చేయాలని.. సముద్రంలో ఈత కొట్టాలని సునీతా విలియమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. భూమ్మీదకు వచ్చింది కాబట్టి.. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత సునీత తన దైనందిన జీవితాన్ని మొదలుపెడుతుంది. సునిత క్షేమంగా భూమి మీదకు తిరిగి రావడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. క్షేమంగా వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. “సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకు వచ్చారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. తదుపరి నిర్వహించే ప్రయోగాలలో ముఖ్యపాత్ర పోషించాలి. ఆమె ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు. ఆమె చొరవ, తెగువ ఎంతోమందికి ఆదర్శనీయమని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
Splashdown of Dragon confirmed – welcome back to Earth, Nick, Suni, Butch, and Aleks! pic.twitter.com/M4RZ6UYsQ2
— SpaceX (@SpaceX) March 18, 2025