Sunita Williams
Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు చేరుకున్నారు. మూడోసారి ఆమె ఈ యాత్ర చేస్తున్నారు. ఆమెతోపాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ సైతం బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ నౌక గురువారం ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంట కొట్టి వారిని ఆహ్వానించారు.
డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్..
ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న తర్వాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలిమయ్స్ డ్యాన్స్ చేసి తన ఆనందం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకుని తన సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో షేర్‌చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింల్లో వైరల్ అవుతోంది. భార రహిత స్థితిలో ఉన్న ఐఎస్‌ఎస్‌లో సునీతా విలియమ్స్ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
అందరం కుటుంబ సభ్యులం..
ఈ సందర్భంగా సునీత విలియమ్స్ మాట్లాడుతూ ఐఎస్‌ఎస్‌లో ఉన్నవారమంతా కుటుంబ సభ్యులమని తెలిపారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని పేర్కొన్నారు. అంతకుముందు బోయింగ్ స్టార్‌లైనర్ ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్ కొద్దిసేపు పరిశీలించారు. మార్గ మధ్యంలోనూ ఈ క్యాప్సుల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనికారణంగా వ్యోమగాములకు ఇబ్బంది లేదని బోయింగ్ వెల్లడించింది. నౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
మూడోసారి అంతరిక్ష యాత్ర..
ఇదిలా ఉండగా సునీతా విలిమయ్స్ అంతరిక్ష యాత్ర చేయడం ఇది మూడోసారి. 2006, 2012లో ఆమె ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్సేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి యాత్రలో సునీత తన వెంట భగవద్గీతను తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహం తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Hugs all around! The Expedition 71 crew greets Butch Wilmore and @Astro_Suni aboard @Space_Station after #Starliner docked at 1:34 p.m. ET on June 6. pic.twitter.com/wQZAYy2LGH
— Boeing Space (@BoeingSpace) June 6, 2024
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sunita williams dance in space video viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com