https://oktelugu.com/

SpaceX new mission : స్పేస్‌ఎక్స్‌ కొత్త మిషన్‌.. చంద్రుడిపైకి ఓకేసారి రెండు లాండర్లు..

అంతరిక్ష ప్రయోగాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రైవేటు సంస్థ స్పేస్‌ ఎక్స్‌(Sapce X) ఇప్పటికే సాధారణ వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి రికార్డు సృష్టించింది. మార్స్‌పై మనుషులు జీవించడమే తనక్ష్యం అంటున్న స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తాజాగా చంద్రుడిపై పరిశోధనలు మొదలు పెట్టారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 15, 2025 / 04:25 PM IST

    SpaceX new mission

    Follow us on

    SpaceX new mission  : అంతరిక్ష ప్రయోగాలతో ప్రత్యేతను చాటుకుంటున్న ప్రైవేటు సంస్థ స్పేస్‌ ఎక్స్‌. ఇప్పటికే పలు పరిశోధనలు చేసింది. అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకునేలా పరిశోధనలు చేస్తున్నామరు. మరోవైపు సాధారణ పౌరులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు. ఇటీవలే ఐదుగురిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి స్పేస్‌వాక్‌ కూడా చేయించారు. ఈ క్రమంలో తాజాగా మరో ప్రయోగం మొదలు పెట్టింది. 2025 కొత్త మిషన్‌తో ముందుకు సాగుతోంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది.
    జనవరి 15న ప్రయోగం..
    భారత కాలమానం ప్రకారం.. జనవరి 15న(బుధవారం) ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ – 9 రాకెట్‌ బ్లూ ఘోస్ట్‌–1, ఐస్పేస్‌కు చెందిన హుకుటో–ఆర్‌2 లను మోసుకెళ్లింది. చంద్రడిపై పరిశోధనలకు గాను స్పేస్‌ ఎక్స్‌ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు వేర్వేరు సాంకేతికతలకు చెందినవి కూడా.

    అంతరిక్షంలోకి సామాన్యులు
    సామాన్యులను అంతరిక్షంలోకి పంపాలన్న దిశగా చాలా ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ప్రముఖ సంస్థలు వర్జిన్‌ గెలాక్టిక్, అమెజాన్‌ శ్రీకారం చుట్టాయి. నాన్‌ ప్రొఫెషనల్‌ ఆస్ట్రోనాట్స్‌ను తొలిసారి నింగిలోకి విజయవంతంగా పంపించారు. స్సేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌–9(Fulcan-9) రాకెట్‌లో నలుగురు సామాన్యులు అంతరిక్షంలోకి వెళ్లారు. ఇన్‌స్సిరేషన్‌ 4 పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతమైందని స్పేస్‌ ఎక్స్‌ ప్రకటించింది. అంతరిక్షంలోకి వెళ్లినవారిలో జేర్డ్‌ ఇసాక్‌మన్, పైలెట్‌ సియాన్‌ ప్రొక్టార్, మెడికల్‌ ఆఫీసర్‌ హేలీ ఆర్సెనియాక్స్, మిషన్‌ స్సెషలిస్ట్‌ క్రిస్‌ సెంబ్రోస్కి ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అయిన ఖర్చును ఇసాక్‌మన్‌ భరించారు.