KTR : హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ కార్ రేస్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతిగానీ, హెచ్‌ఎండీఏ అనుమతిగానీ లేకుండానే నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ రూ.56 కోట్లు విదేశీ సంస్థకు కేటాయించారు. విదేశీ సంస్థలకు నిధుల కేటాయింపునకు ఆమోదం తప్పనిసరి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు గుర్తించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా విధించింది. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లు నిర్ధారించి కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. గవరనర్ అనుమతి ఇవ్వడంతో 2024, డిసెంబన్ 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 19న ఈడీ రంగంలోకి దిగి వివరాలు కోరింది. అయితే తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్(Fir) కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించింది. తర్వాత క్వాష్ పిటిషన్(Kwash pition) కొట్టేసింది. అరెస్టు చేయకుండా కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఏసీబీ కేటీఆర్‌ను విచారణకు పిలిచి సుమారు 5 గంటలపాటు ప్రశ్నించింది.
సుప్రీం కోర్టుకు కేటీఆర్..
హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో కేటీఆర్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జనవరి 10న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జనవరి 15న విచారణ జరిపిన ధర్మాసనం.. కేటీఆర్ పిటిషన్‌ను డిస్మస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది. దీంతో పిటిషన్ కేటీఆర్ న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే విచారణ జరిపారు.
విరారణ ఇక వేగవంతం..
దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ కేటీఆర్‌కు షాక్ తగలడంతో దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీ ఇక దూకుడు పెంచనున్నాయి. ఇప్పటికే ఏసీబీ విచారణ జరిపింది. ఈడీ ఎదుట జనవరి 16న కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు సంస్థలు విరారణను మరింత పెంచుతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో అరెస్టు, విచారణకు ఉన్న ఆటంకాలనీ తొలగిపోయాయని దర్యాప్తు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఏసీబీ కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఏసీబీ విచారణ చేసింది. వీటి ఆధారంగా కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలిసింది.