TCS : ఐటీ కొలువులు యువత డ్రీమ్ జాబ్‌లుగా మారాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేవారు. అయితే క్రమంగా ప్రభుత్వ కొలువులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు కొలువులు పెరుగుతున్నాయి. దీంతో ప్రైవేటు ఉద్యోగాలకు పోటీ పెరిగింది. వేతనం ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. మూడు నాలుగేళ్లుగా ఐటీ సంస్థలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగులు అప్‌డేట్ కాకపోవడం, ఏఐ ఆధిపత్యం, ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో సీనియన్ ఐటీ ఉద్యోగులు కూడా కొలవు కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో నూతన నియామకాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(TCS) ఈ ఏడాది 40 వేల మందిని నియమించుకోవాలని భావిస్తోందని ఐటీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5 వేలు తగ్గినట్లు తెలిపారు. ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. టీసీఎస్ సంస్థలోఉద్యోగం పొందాలంటే కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని, వారికి తగిన విద్యార్హతలు కూడా ఉండాలని వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స(అఐ) కారణంగా ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు.
పెరుగుతున్న సామర్థ్యం..
ఏఐ కారణంగా ఉద్యోగుల సామర్థ్యం పెరుగుతుందని మిలింద్ పేర్కొన్నారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని తెలిపారు. క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో ఇతర అవసరమైన విభాగాలలో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గితే కంపెనీ వృద్ధి తగ్గినట్లు కాదని స్పష్టం చేశారు.
ప్రణాళిక ప్రకారం నియామకాలు..
ఇక కంపెనీలో నియామక ప్రక్రియ ప్రణాళిక 6పకారం జరుగుతుందని మిలింద్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బ్యాలెన్స్ జరుగుతుందని తెలిపారు. 2025లో కంపెనీ వృద్ధిరేటు గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI)ని ఏకీకృతం చేస్తోంది. ఏఐ సంబంధిత నైపుణ్యాలు పొందేందుకు ఉదయం టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (అఐ)ని ఏకీకతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు ఈ0 నుంచి ఈ3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
– E0 (ఎంట్రీ లెవెల్): లార్డ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్‌ఎల్‌ఎంలు), వాటితో ముడిపడిన అప్లికేషన్లపై ప్రాథమిక అవగాహన ఉండే విభాగంలోకివస్తారు.
– E1: ప్రాంప్ట్ ఇంజినీర్లు మాత్రమే కాకుండా ఎల్‌ఎల్‌ఎం ఏఐలతో పనిచేయగల సామర్థ్యం ఉన్నవారు ఈ విభాగంలోకి వస్తారు.
– E2 : టీసీఎస్ జెన్ ఏఐ సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్నవారు ఈ విభాగంలోకి వస్తారు.