Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSpace Walk Spacex Mission: ముగిసిన బిలయనీర్ల స్పేస్‌ వాక్‌.. సేఫ్‌గా భూమిపైకి వచ్చిన ఐదుగురు..

Space Walk Spacex Mission: ముగిసిన బిలయనీర్ల స్పేస్‌ వాక్‌.. సేఫ్‌గా భూమిపైకి వచ్చిన ఐదుగురు..

Space Walk Spacex Mission: అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్‌ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్‌ జేర్డ్‌ ఐజక్‌మన్‌ భూమిపైకి తిరిగి వచ్చారు. ఐదు రోజుల పర్యటన ముగించుకుని ఐజక్‌మన్‌ తన సిబ్బందితో కలిసి స్పేప్‌ఎక్స్‌ క్యాప్సూల్‌లో స్పేస్‌లోకి వెళ్లారు. మిషన్‌ పూర్తి చేసుకుని ఫ్లోరిడా రాష్ట్రం డ్రైటార్ట్‌గస్‌ బీచ్‌లో లాండ్‌ అయింది. జేర్ట్‌ ఐజక్‌మన్‌తోపాటు స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఇద్దరు ఇంజినీర్లు అన్నా మెనోన్, సారా గిల్లీస్, మాజీ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌స్కాట్‌ కిడ్‌పోటీట్‌ సురక్షితంగా భూమిపై దిగారు. దీంతో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఈ ప్రాజెక్టుతో చరిత్రసృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్‌ నిర్వహించిన సంస్థగా నిలిచింది.

ఒకరి తర్వాత ఒకరు..
పొలారిస్‌ డాన్‌ ప్రాజెక్టు కింద ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా నలుగురు వ్యక్తులను స్పేస్‌ ఎక్స్‌ మంగళవారం(సప్టెంబర్‌ 10న) నింగిలోకి పంపింది. ఈ ప్రాజెక్టు మొత్త స్పేస్‌ ఎక్స్‌ పరికరాలనే ఉపయోగించారు. వీరి అంతరిక్ష నౌక అత్యధికంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లింది. 1400 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. 740 కిలోమీటర్ల దూరంలో జేర్ట్‌ ఐజక్‌మన్‌ సారా గిల్లీలు ఒకరితర్వాత ఒకరు వ్యోమ నౌక నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్‌ చేశారు. 1965 సోవియన్‌ యూనియన్‌ తొలిసారి స్పేస్‌వాక్‌ చేసిన తర్వాత జేర్ట్‌ ఐజక్‌మన్‌ 264 వ్యక్తిగా సారా గిల్లీస్‌ 265వ వ్యక్తిగా స్పేస్‌ వాక్‌ చేసిన వ్యక్తులుగా నిలిచారు. ఇదిలా ఉంటే గతంలో స్పేస్‌వాక్‌ చేసిన వారంతా వ్యోమగాములే. ఐజక్‌మన్‌ మాత్రం సాధారణ వ్యక్తి.

40 రకాల ప్రయోగాలు
స్పేస్‌ ఎక్స్‌ తయారు చేసిన స్పేస్‌ సూట్‌ను పరీక్షించారు. అంతరిక్షంలో ఐదు రోజులు గడిపిన బృందం దాదాపు 40 రకాల 6పయోగాల్లో పాల్గొంది. మైక్రో గ్రావిటీలో మనిషి శరీరం స్పందించే తీరుతోపాఉట కిడ్నీల పనితీరు, వాటిల్లో రాళ్లు ఏర్పడడం, స్పేస్‌లో సీపీఆర్‌ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు. దీనికోసం ఐజక్‌మన్‌ సుమారు 200 మిలియన్‌డారల్లు సొంతంగా వెచ్చించారు.

ఎక్స్‌లో పోస్టు చేసిన మస్క్‌..

ఇదిలా ఉంటే పోలారిస్‌ డాన్‌ చారిత్రాత్మక స్పేస్‌వాక్‌ మిషన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎలాన్‌ మస్క్‌ నలుగురు సభ్యుల ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. మిషన్‌ నుంచి పొలారిస్‌ డాన్‌ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడాన్ని స్వాగతించారు. సిబ్బంది హెలికాప్టర్‌ నుండి నిష్క్రమించిన తర్వాత స్పేస్‌సూట్‌లలో నవ్వుతూ మరియు ఊపుతూ కనిపించారు. ‘పొలారిస్‌ సిబ్బంది ఇంట్లో సురక్షితంగా మరియు సౌండ్‌గా ఉన్నారు‘ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version