Go Green Car Exhaust Filter: వాహనాల నుంచి వచ్చే కర్పన ఉద్ద్గారాల వల్ల వాతావరణం తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటుంది. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి తీవ్రం కావడంతో వాహనాలు పొల్యూషన్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఫ్యూయల్ ఇవ్వాలనే నిబంధన తీసుకువచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా మిగతా ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా అయితే ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వాహనాల నుంచి విడుదల అయ్యే కార్బన్ ఉద్గారాలను స్వచ్ఛమైన గాలిలా తయారు చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అలా తయారు చేయడానికి ఇద్దరు కుర్రాళ్ళు ముందుకు వచ్చారు. గో గ్రీన్ ప్రాజెక్టు పేరుతో ఎగ్జాస్ట్ ఫిల్టర్ లను సృష్టించారు. ఈ పరికరం 74% కంటే ఎక్కువగా కార్బన్ ఉద్గాయాలను తగ్గిస్తుంది. మరి దీనిని ఎవరు సృష్టించారు..? ఇది ఎలా కాలుష్యాన్ని తగ్గిస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే గో గ్రీన్ కార్ ఎగ్జాస్ట్ ఫిల్టర్ గురించి చర్చ జరుగుతోంది. దీనిని సృష్టించింది ఇద్దరు కుర్రాళ్ళు. వీరు అమెరికాకు చెందిన వారే అయినా.. వారి తల్లిదండ్రులు భారత్కు చెందిన వారే. ప్రస్తుతం పెన్సిల్ వేనియాలోని యూనియన్ వెళ్లే హైస్కూల్లో చదువుతున్న రోహన్ కపూర్, జాక్ రీచార్జ్ అనే 18 ఏళ్ల కుర్రాళ్ళు పర్యావరణ ఆవిష్కరణ పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపారు. వీరి ఆలోచన గో గ్రీన్ కార్ ఎగ్జాస్ట్ ఫిల్టర్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడింది. వీరిలో రోహన్ కపూర్ ఒక సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టు సందర్భంగా MIT ప్రొఫెసర్ ఐజాక్ బెర్టీన్ వీరికి ఒక సలహా ఇచ్చాడు. కార్బన్ ను సంగ్రహించడంలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాడు. దీంతో ఒక గ్లాస్ ప్లేట్ ఆల్గే తో ప్రారంభమైన వీరి ప్రయోగం కఠిన పరీక్షలు ఎదుర్కొని చివరికి ఎగ్జాస్ట్ పైపులను తయారు చేసేందుకు దారితీసింది. వీరి ఆవిష్కరణను వరల్డ్ సిరీస్ ఆఫ్ ఇన్నోవేషన్, స్టేట్ ఇన్వెన్షన్ కన్వెన్షన్ లో ప్రదర్శించడంతో ప్రశంసలు అందాయి.
గో గ్రీన్ కారు ఎగ్జాస్ట్ ఫీల్డర్ ను కారు వెనుక భాగంలో అమరుస్తారు. ఇది కారు నుంచి బయటకు వచ్చే కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని దానిని ఆక్సిజన్ గా మార్చి బయటకు విడుదల చేస్తుంది. ఈ సహజ ప్రక్రియ వల్ల సూక్ష్మశైవలాలు కార్బన్డయాక్సైడ్ ను బయోమాసుగా మారుస్తాయి. ఆ తర్వాత ఆక్సిజన్ గా మారి రిలీజ్ చేస్తాయి. దీంతో గాలిలోకి ఎలాంటి హానికరమైన కార్బన్డయాక్సైడ్ విడుదల అవ్వదు. ఈ రీసైకిల్ వల్ల 74.25% వరకు కర్బన ఉధ్గారాలను తగ్గించినట్లు అవుతుంది. ఈ గో గ్రీన్ కార్ ఎగ్జాస్ట్ ఫిల్టర్ను ఎల్ఈడి లైట్ స్ట్రిప్ లు వాహనం ఫిల్టర్ యొక్క సిలిండర్ బాక్స్ వద్ద అమర్చారు.
అంతేకాకుండా ఈ ఎగ్జాస్ట్ ఫిల్టర్ ను తయారు చేయడానికి 30 డాలర్ల కంటే తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. దీనిని ఉపయోగించిన తర్వాత కార్బన్డయాక్సైడ్లు సగటున 14.1% నుంచి 2.8%కి పడిపోయాయి. అలాగే ఆక్సిజన్ స్థాయిలో 0.77 శాతం నుంచి 10.4 శాతానికి పెరిగాయి. దీంతో ఈ గో గ్రీన్ ప్రాజెక్టు అద్భుతమైనదిగా పేర్కొంటున్నారు.