మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?

దేశంలో రోజురోజుకు స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫోన్ పోగొట్టుకుంటే మనం పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఫోటోలు, వీడియోలు, మెసేజ్ లతో పాటు బ్యాంక్ ఖాతాల చెల్లింపుల యాప్ లు, సోషల్ మీడియా ఖాతాలు అన్నీ ఫోన్ లోనే ఉంటాయి. ఎవరైనా ఫోన్ ను దొంగలిస్తే బాధ పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ ను పాటించడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను సులభంగా కనిపెట్టవచ్చు. ఐఓఎస్ ఫోన్ ను […]

Written By: Kusuma Aggunna, Updated On : June 2, 2021 9:34 am
Follow us on

దేశంలో రోజురోజుకు స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫోన్ పోగొట్టుకుంటే మనం పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఫోటోలు, వీడియోలు, మెసేజ్ లతో పాటు బ్యాంక్ ఖాతాల చెల్లింపుల యాప్ లు, సోషల్ మీడియా ఖాతాలు అన్నీ ఫోన్ లోనే ఉంటాయి. ఎవరైనా ఫోన్ ను దొంగలిస్తే బాధ పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ ను పాటించడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను సులభంగా కనిపెట్టవచ్చు.

ఐఓఎస్ ఫోన్ ను పోగొట్టుకున్న వాళ్లు ఫైండ్ మై ఐఫోన్ ద్వారా సులభంగా ఐ ఫోన్ ఎక్కడ ఉన్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్లు ఫైండ్ మై డివైజ్ సహాయంతో సులభంగా ఫోన్ ను కనిపెట్టవచ్చు. చాలామంది సెట్టింగ్స్ లో ఫైండ్ మై డివైజ్ ఆప్షన్ ను ఆఫ్ చేసి ఉంటారు. ఈ ఆప్షన్ ను ఆన్ చేసి ఉంచుకుంటే ఫోన్ పోయినా ఇబ్బంది పడే అవకాశాలు తగ్గుతాయి.

ఫైండ్ మై ఫోన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ మాదిరిగా పని చేసే ఈ యాప్ ను ఫోన్ లో లొకేషన్ ఆన్ చేసి ఉంచడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://www.google.com/android/find?u=0 అనే లింక్ ద్వారా కూడా పోగొట్టుకున్న ఫోన్ ను సులభంగా వెబ్ ఇంటర్ ఫేస్ ద్వారా గుర్తించవచ్చు. ఇందులో ప్లే సౌండ్ ఆప్షన్ ను ఎంచుకుంటే ఫోన్ స్విఛాఫ్ అయినా కూడా రింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఎరేజ్ దివైజ్ ఆప్షన్ సహాయంతో ఫోన్ లో ఉన్న సమాచారాన్ని డిలేట్ చేసే అవకాశం ఉంటుంది. సెర్బరస్, మెకాఫీ మొబైల్ సెక్యూరిటీ, ప్రే, ఫోన్ యాంటీ థెఫ్ట్ అలారం లాంటి యాప్ లతో పోగొట్టుకున్న ఫోన్ ను సులభంగా కనిపెట్టవచ్చు.