Oneplus 15 Oneplus 15R: 2026 కొత్త సంవత్సరం సందర్భంగా మొబైల్స్ కంపెనీలు కొత్త ఫోన్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా Oneplus నుంచి కొత్తగా 15 R 2026 మోడల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు వచ్చిన oneplus 15 కంటే కొత్తగా వచ్చిన వన్ ప్లస్ 15R ఏ విధమైన అప్డేట్ ను కలిగి ఉంది? అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే కొన్ని తేడాలు ఉన్నట్లు గుర్తించవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..
Oneplus 15, Oneplus 15 R రెండు ఫోన్లో డిస్ప్లే విషయంలో ఒక దానికి ఒకటి పోటీపడ్డాయి. అయితే కొత్త మొబైల్ పాత దాని లాగే సిగ్నేచర్ వృత్తాకార కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. ఇది బాక్సి, ఫ్లాట్ సైడ్ డిజైన్ తో ఆకర్షిస్తుంది. దీని వెనక సిరామిక్ లాంటి పూతతో ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. అలాగే వన్ ప్లస్ 15 మెరుగైన సామర్థ్యాన్ని అంటే LTPO పానెల్ ను కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కింద ఉండనుంది. కానీ వన్ ప్లస్ 15 ఆర్ పైన గొరిల్లా గ్లాస్ 7i తో LTPS ప్యానెల్ ను కలిగి ఉంది.
వన్ ప్లస్ 15 మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 4.6 GHz వరకు క్లాక్ స్పీడును కలిగి ఉంటుంది. వన్ ప్లస్ 15 ఆర్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 తో ఉండి… 3.8 GHz వద్ద క్లాక్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. రోజువారి వాడకంలో రెండు సున్నితంగా, వేగంగా అనిపిస్తాయి. మెమొరీ విషయానికి వస్తే వన్ ప్లస్ 15 లో 512 జీబి వరకు స్టోర్ చేసుకోవచ్చు.. 16 జిబి రామ్ తో పని చేయవచ్చు. 15 ఆర్ లో ఇది పరిమితంగా ఉండనుంది. 5 12 జిబి స్టోరేజీ ఇచ్చినా.. గరిష్టంగా 12 జిబి ram వరకు పనిచేస్తుంది. Oneplus 15 R లో 7,400 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80 వాట్ వైడ్ చార్జింగ్ కు మద్దతు ఇస్తూ వేగంగా చార్జింగ్ అవుతుంది.. 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 50 శాతం వరకు చార్జింగ్ అవగలదు. Oneplus 15 లో మాత్రం 7,300 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 120 వాట్ వైడ్ ఫాస్ట్ చార్జింగ్ తో మద్దతు ఇస్తుంది.
ఈ రెండు మొబైల్స్ లోనూ కెమెరా తీరు అద్భుతం అని చెప్పవచ్చు. రెండిటిలో 50 MP ప్రధాన కెమెరాను అమర్చారు. ఫోర్ కె వీడియో షూట్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంది. అయితే oneplus 15 R లో 8 MP సెన్సార్ తో తక్కువ రిజర్వేషన్ పనిచేస్తుంది. కానీ ఖరీదైన 7x జూన్ తో కూడిన 50 MP టెలి ఫోటో కెమెరాలు అమర్చారు.