New Aadhaar card features: భారతదేశంలో ఒక వ్యక్తికి గుర్తింపు ఉండాలని అనుకుంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. పుట్టిన తేదీ నమోదు నుంచి మరణం సర్టిఫికెట్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మారింది. అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు తీసుకునే విషయంలో కూడా పద్ధతులు మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు మీసేవ సెంటర్ లోకి వెళ్లి క్యూలో ఉండి రోజుల తరబడి వేచి చూస్తే తప్ప ఆధార్ కార్డు రాలేదు. కానీ ఇప్పుడు మీ సేవా సెంట్రల్ తో పాటు ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసే సెంటర్లు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు మరింత టెక్నాలజీ ముందుకు వచ్చి ఆధార్ కార్డుకు బదులు ఆన్లైన్లోనే డిజిటల్ కార్డును అడుగుతున్నారు. అయితే ఈ డిజిటల్ కార్డును ఎలా పొందాలి?
ప్రస్తుతం ప్రతి అవసరానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. అయితే మనం ఒక్కోసారి బిజీ గా ఉండి మ్యానువల్ గా ఆధార్ కార్డు తీసుకెళ్లడానికి అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ ఆధార్ కార్డును తీసుకువెళ్లినా కూడా దానిని జిరాక్స్ తీయడం.. వంటి పని భారం ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం aadhar యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చును. అవసరం ఉన్నవారికి దీనిని ఇవ్వవచ్చు. అంతేకాకుండా ఈ ఆధార్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. ఎవరికైనా ఆధార్కు సంబంధించిన వివరాలు అడిగితే ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే చాలు వారికి సంబంధించిన వివరాలు మొత్తం కనిపిస్తాయి. దీంతో ప్రత్యేకంగా ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆధార్ కార్డు యాప్ లో రిజిస్టర్ అయితే పనులు సులభంగా మారిపోతాయి.
అంతేకాకుండా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం అతనికి వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణకు కొన్ని సంస్థలు డేటాఫ్ బర్త్ మాత్రమే అడుగుతాయి. ఇలాంటి వారికి డేటాఫ్ బర్త్ మాత్రమే కనిపించే ఆధార్ కార్డును ఈ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు కేవలం రెసిడెన్సి అడ్రస్ మాత్రమే అడుగుతాయి. ఇలాంటి వారికి కూడా కేవలం రెసిడెన్సి అనే ఆప్షన్ను ఎంచుకొని ఓన్లీ రెసిడెన్సి కనిపించేలా ఆధార్ కార్డును ఇవ్వవచ్చు. ఇలా పలు రకాల సౌకర్యాలు ఈ యాప్ లో ఉండడంతో.. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ పనులన్నీ కావాలంటే ముందుగా ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలను నమోదు చేసుకోవాలి.
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ద్వారా ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఇందులో ఫింగర్ ప్రింట్ లాక్ సౌకర్యం కూడా ఉంది. దీనిని జనరేట్ చేసుకుంటే ఆధార్ వివరాలు ఇతరులకు వెళ్లకుండా లాక్ అయిపోతాయి. అలాగే ఈ ఫింగర్ ప్రింట్ లాక్ ను మనం కావలసినప్పుడు ఉపయోగించి అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు.