NASA- Electric Cars: ఎలక్ట్రిక్ కార్లు.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ పాపులర్ చేసిన ఈ కార్లకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 300 పైగా కిలోమీటర్లు ప్రయాణిస్తుండడంతో అందరూ ఈ ప్రకృతికి హాని కలిగించని కార్లను ఎంచుకొని దూసుకుపోతున్నారు. అయితే ఈ కార్లలో ఉండే మైనస్ ఏంటంటే.. వీటి ద్వారా ప్రయాణిస్తుండగా చార్జింగ్ అయిపోతే ఆ రహదారిపై పెట్టుకోవడం కష్టం. పెట్రోల్ అంటే రోడ్డుపక్కన బంకుల్లో కొట్టుకోవచ్చు.కానీ కరెంట్ చార్జింగ్ పెట్టడం కష్టం. ఇక లాంగ్ జర్నీ కూడా కష్టమే. నగరంలో కొద్దిదూరం మాత్రమే ప్రయాణించవచ్చు. ఇప్పుడీ సమస్యలను నాసా తీర్చేసింది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సరికొత్త ఆవిష్కరణకు పురుడు పోసింది. ఎలక్ట్రిక్ కార్లకు 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యేలా ‘సబ్ కూల్డ్ ఫ్లో బాయిల్డ్ టెక్నాలజీని రూపొందించింది.
ఈ పద్ధతిలో ఛార్జింగ్ కేబుల్ ద్వారా లిక్విడ్ కూలెంట్ ను పంప్ చేస్తారు. అది 2400 ఆంపియర్ల కరెంట్ ను అందిస్తుంది. దీంతో ప్రస్తుత ఛార్జర్ల కంటే 4.6 రెట్లు ఎక్కువగా కరెంట్ అంది. ఛార్జింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది..
ఇది కనుక సక్సెస్ అయితే ఇక పెట్రోల్, డీజిల్ వంటి కార్ల స్థానంలో ఈ పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లే అందుబాటులోకి వస్తాయి. అందరూ కొనడానికి ఆస్కారం ఉంటుంది. మైలేజ్ కూడా పెరిగితే ఇక పెట్రోల్ కార్లు రోడ్డుపై చూడడం కష్టమే. అన్నీ ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయి. ఆ రోజు రావాలని ఆశిద్దాం..