https://oktelugu.com/

Varra Ravinder Reddy : మనుషులా.. వైసీపీ నేతలా.. ఇంత బూతులా.. వర్రా రవీందర్ రెడ్డి పదజాలం చూసి తట్టుకోలేం

ఈమధ్య తరచూ వినిపిస్తున్న మాట.. భావ ప్రకటన స్వేచ్ఛ. దీని మాటున సోషల్ మీడియాలో జరుగుతున్న వికృత క్రీడ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అటువంటి కీచకులపై పడింది కూటమి సర్కార్.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2024 / 06:16 PM IST

    Pulivendula Varra Ravinder Reddy Arrested

    Follow us on

    Varra Ravinder Reddy : వైసిపి కోసం బలంగా పనిచేసిన సోషల్ మీడియా యాక్టివిస్టిల్లో వర్రా రవీందర్ రెడ్డి కీలక వ్యక్తి. ఆయన కామెంట్స్ దారుణంగా ఉంటాయి. నీచాతి నీచంగా ఉంటాయి. వైసీపీ కోసం, జగన్ ప్రయోజనాల కోసం ఎంత దాకా అయినా రవీందర్ రెడ్డి తెగిస్తారు. చివరకు జగన్ సోదరి వైయస్ షర్మిల సైతం విడిచిపెట్టలేదు. సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టి ఆమెకు ఇబ్బంది పెట్టారు. చివరకు ఆమె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే తనకున్న లాబీయింగ్ బలంతో బయటపడ్డారు రవీందర్ రెడ్డి. అప్పట్లో కెసిఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ సర్కార్లో సైతం రవీందర్ రెడ్డి అనుకూలమైన పోలీస్ అధికారులు ఉన్నారు. అందుకే ఆయన ఇట్టే తప్పించుకోగలుగుతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కులాన్ని వర్గాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలతో ఆడుకుంటున్న విషయంపై పవన్ మాట్లాడారు. వర్రా రవీందర్ రెడ్డి విషయంలో జరుగుతోంది అదే. కులాలను రెచ్చగొట్టడంలో కూడా అంది వేసిన చేయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో ఒక సామాజిక వర్గాన్ని నింపి.. అదే సామాజిక వర్గంలో ఉద్రేకాలను పెంచి పోషిస్తుంది రవీందర్ రెడ్డి. అయితే ఎట్టకేలకు ఏపీలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అరెస్ట్ కూడా జరిగింది.

    * బూతులు మాట్లాడే వారే అధికం
    ఏపీలో గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో నేతలు జుగుప్సాకరంగా మాట్లాడారు. బూతులు మాట్లాడే నేతలు సైతం ఉండేవారు. అప్పట్లో అదో ఫ్యాషన్ గా కనిపించేది వారికి. మంత్రుల నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకు వాడే భాష నీచంగా ఉండేది. సోషల్ మీడియాలో పద ప్రయోగం సైతం దారుణంగా నడిచేది. అప్పట్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే హింసించేవారు. బూతులు అందుకునేవారు. ఇంట్లో ఆడవాళ్లను సైతం బయటకు తీసి దారుణంగా వేధించేవారు. ప్రధానంగా పంచ్ ప్రభాకర్, ఇంటూరి కిరణ్, వర్రా రవీందర్ రెడ్డి దారుణంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి.

    * కీచకులపై కేసులు
    గత మూడు రోజులుగా సోషల్ మీడియా కీచకులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఒకే రోజు వందలాది కేసులు నమోదయ్యాయి. అయితే అందరి భాష అలానే ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. గతంలో ఫేస్బుక్ అకౌంట్ లను తొలగించి.. కొత్త పేర్లతో పదప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికీ అదే దూకుడు కనబరుస్తున్నారు. ముఖ్యంగా రవీందర్ రెడ్డి ఖాతా నుంచి వస్తున్న కామెంట్స్ దారుణంగా ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా పోస్టులు పెట్టేవారు.. ఇప్పుడు అదే మాదిరిగా పెడుతున్నారు. పైగా తమకు ఏం కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి అయితే వర్రా రవీందర్ రెడ్డి అరెస్టుతో సోషల్ మీడియా కీచకుల భరతం పట్టినట్లు అయింది. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైతే తప్ప.. వారికి రారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.