WhatsApp: మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సాన్ వినియోగించకుండా ఉండరు. స్కూలు కెళ్లె విద్యార్థుల నుంచి బడా వ్యాపారులు నిత్యం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేషన్ పెంచుకుంటారు.కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి అవసరాలు మారుతున్నాయి. వారికి అనుగుణంగా వాట్సాప్ ను తీర్చిదిద్దుతున్నారు. కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో అప్డేట్ ను ఇచ్చింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. వాట్సాప్ లో పంపే వాయిస్ మెసేజ్ ను ఒ అవతలి వ్యక్తి ఒకేసారి వినేలా ఫీచర్స్ ను తెచ్చింది. దీని వల్ల ఎటువంటి ఉపయోగాలంటే?
వాట్సాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కాకుండా ఫొటోస్, వీడియోస్ పంపించుకునే సదుపాయం ఉంది. ఇవి వీలుకాని సమక్షంలో వాయిస్ మెసేజ్ ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చు. అయితే కొన్ని వాయిస్ మెసేజ్ లు ఒక్కసారి వాట్సాప్ ద్వారా మొబైల్ లోకి వచ్చిన తరువాత వాటిని పదే పదే వినే అవకాశం ఉండేది. అలాగే దానిని ఇతరులకు షేర్ చేసే సదుపాయం కల్పించారు. కానీ కొందరు ప్రైవసీని కొరుతూ తమ వాయిస్ మెసేజ్ ను ఒకేసారి విని షేర్ చేయకుండా ఉండే బాగుండేది అని సోషల్ మీడియాలో వినతులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆ ఫీచర్ ను అప్డేట్ చేసింది. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ ఒక్కసారి సెండ్ చేసిన తరువాత దానిని ఒక్కసారి మాత్రమే వినగలుగుతారు. ఆ తరువాత దానిని స్క్రీన్ షాట్ తీయడం గానీ.. లేదా ఇతరులకు షేర్ చేయడం గాని ఉండదు. దీంతో కొందరు తమ మెసేజ్ మాత్రమే చేరి దానిని ఇతరులకు షేర్ చేయకుండా ఉండాలనుకునేవారికి ఇది ప్రయోజనంగా ఉంటుందని మెటా భావించింది. అందువల్ల దీనిని ప్రవేశపెట్టింది.
ఇప్పటి వరకు వరకు కొన్ని ఫోటోస్, వీడియోస్ షేర్ చేసిన తరువాత As View Once అని కనిపించేంది. అంటే వీటిని షేర్ చేయడం గానీ, లేదా స్క్రీన్ షాట్ తీయడం గాని అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాయిస్ మెసేజ్ ను కూడా అలాగే సెట్ చేసుకోవచ్చు. దీంతో వాయిస్ మెసేస్ కు భద్రత ఉండే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం వల్ల చాలా మందికి తమ విషయాలు గోప్యంగా ఉండేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.