Whatsapp New Features: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్య తీరనుంది..

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. అయితే ఒక్కోసారి మనం బిజీగా ఉండడం వల్ల ఈ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేకపోతుంటాం. దీంతో అవి మిస్ట్ కాల్స్ గానే ఉంటాయి.

Written By: Srinivas, Updated On : June 19, 2023 12:38 pm

Whatsapp New Features

Follow us on

Whatsapp New Features: ఈరోజుల్లో ప్రతీ మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి బడా కంపెనీ వ్యాపార వేత్తలు తమ కార్యకలాపాలను నడిపించేందుకు ఈ యాప్ ను కచ్చితంగా ఉపయోగిస్తున్నారు. యూజర్స్ కు అనుగుణంగా Meta ఎప్పటికప్పుడు లేటేస్ట్ అప్డేట్స్ ను అందుబాటులోకి తెస్తుంది. సులభతరంగా తమ ఫైల్స్, మెసెజేస్ పంపించుకోవడంతో పాటు వాయిస్, వీడియో కాల్స్ ను మాట్లాడే సౌకర్యాన్ని ఉంచింది. లేటేస్టుగా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మీకు చేసిన వీడియోకాల్స్ మిస్ట్ కాల్స్ గానే చూపించేవి. కానీ అవి అవసరాన్ని భట్టి తిరిగి రిటర్ట్స్ కాల్స్ వెళ్లే విధంగా న్యూ ఫీచర్ ను తీసుకొస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. అయితే ఒక్కోసారి మనం బిజీగా ఉండడం వల్ల ఈ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేకపోతుంటాం. దీంతో అవి మిస్ట్ కాల్స్ గానే ఉంటాయి. అయితే ఇప్పుడు అవి అవసరాన్ని భట్టి రిటర్న్ కాల్ గా వెళ్తుంది. అంటే అత్యవసర సమయంలో మనం ఆ కాల్ చేయకున్నా తిరిగి ఆటోమెటిక్ గా కాల్ చేయబడుతుందన్నమాట. ఇది వాయిస్, వీడియో కాల్ రెండింటికీ వర్తిస్తుంది. ఈ సదుపాయం కావాలంటే మైక్రోసాప్ట్ నుంచి 2.2323.1.0 అనె వెర్షన్ ను వాట్సాప్ వెబ్ అప్డేట్ ను డౌన్లోడ్ చేసుకొని పొందవచ్చు.

ఇవే కాకుండా వాట్సాప్ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ లల్లో వీడియో కాల్ నాణ్యతను పెంచే విధంగా ప్రయత్నిస్తోంది. స్నాప్ చాట్, టెలిగ్రామ్ ల సహాయంతో బీటాలో వీడియో సందేశాన్ని పంపే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు తమ కాంటాక్టులకు 60 సెకన్లలోనే రియల్ టైమ్ వీడియోను పంపవచ్చు.

మరో ఫీచర్ ఏంటంటే వాట్సాప్ వాయిస్, వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్ ను కూడా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే కొత్త డెడికేటేడ్ స్క్రీన్ షేరింగ్ బటన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో అన్ని వాయిస్, వీడియో కాల్స్ వన్ స్టాప్ సొల్యూషన్ గా మారడానికి మీట్స్, జూమ్, స్కైప్ ప్లాట్ ఫాంలను స్వీకరించడానికి ఓవర్ టైమ్ గా పనిచేస్తుంది.