https://oktelugu.com/

GROK 3 : ప్రపంచంలో దీనికి మించింది లేదు.. చాట్ జీపీటీ, డీప్ సీక్ అన్న దీని ముందు జుజుబీనే

ఈ మధ్యకాలంలో ప్రతి పనికి ఏఐను వాడుతున్నాం. చాట్ జీపీటీ వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని అనేక దేశాలు తమ తమ ప్రొడక్ట్ లను దించుతున్నాయి. రీసెంట్ గా చైనా చాట్ జీపీటీకి పోటీగా డీప్ సీక్ ను లాంచ్ చేసింది.

Written By: , Updated On : February 20, 2025 / 04:00 AM IST
GROK 3

GROK 3

Follow us on

GROK 3 : ఈ మధ్యకాలంలో ప్రతి పనికి ఏఐను వాడుతున్నాం. చాట్ జీపీటీ వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని అనేక దేశాలు తమ తమ ప్రొడక్ట్ లను దించుతున్నాయి. రీసెంట్ గా చైనా చాట్ జీపీటీకి పోటీగా డీప్ సీక్ ను లాంచ్ చేసింది. దాని తర్వాత వరుసగా చాట్ బాట్ లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. ఆయనకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ (xAI) ఎట్టకేలకూ తన నెక్ట్స్ జనరేషన్ ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. ‘గ్రోక్ 3’ పేరుతో ప్రవేశ పెట్టిన చాట్బాట్ మునుపటి కంటే మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ చాట్ బాట్ ను ఈ భూమ్మీదనే అత్యంత తెలివైన ఏఐ టూల్గా ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. దీన్ని ‘గ్రోక్ 2’ కంటే పది రెట్లు ఎక్కువ కంప్యూటింగ్ పవర్, నాలెడ్జీతో అభివృద్ధి చేశారు. ఈ గ్రోక్ 3 ఎంతటి టిపికల్ లాజిక్, రీజనింగ్, డీప్ రీసెర్చ్ అండ్ క్రియేట్ వర్క్ అయినా క్షణాల్లో చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి గ్రోక్ అనేది ఒక ఫౌండేషనల్ ఏఐ మోడల్. ఇది ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తున్నా ChatGPT, Copilot, Gemini, Deep seek వంటి ఇతర ఏఐ చాట్‌బాట్‌లకు గట్టి పోటీని ఇస్తుందని చెబుతున్నారు. గ్రోక్ ఇప్పటివరకు ఇమేజ్ ఎనాలసిస్ చేయడం, కస్టమర్ల రిక్వస్ట్లకు సమాధానాలను ఇవ్వడంలో హెల్ప్ చేయడంతో పాటు అనేక జనరేటివ్ ఏఐ ఫీచర్లను అందజేస్తుంది. వీటన్నింటితో పాటు ఈ చాట్బాట్ మరో స్పెషాలిటీ ఏంటంటే.. పాలిటిక్స్ నుంచి సెన్సిటివ్ టాపిక్స్ వరకు అన్ని అంశాలపై ప్రశ్నలకు సమాధానాలను అందజేస్తుంది. ఇతర చాట్బాట్లలో సెక్యూరిటీ కారణాల వల్ల ఇలా చేసేందుకు సాధ్యం కాదు.

‘గ్రోక్ 3’ కొలోసస్ అనే సూపర్ కంప్యూటర్ సాయంతో దాదాపు ఆరు నుంచి 8నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నట్ల ‘ఎక్స్‌ఏఐ’ (xAI) తెలిపింది. అమెరికాలోని ఒక డేటా సెంటర్‌లో ఉంచిన 2,00,000 జీపీయూల (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) క్లస్టర్‌ను ఉపయోగించి దీనికి ట్రైనింగ్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. నిజానికి కంపెనీ దీన్ని 2024లోనే విడుదల చేయాలని ప్లాన్ చేయగా టెక్నికల్ సమస్యల కారణంగా కాస్త లేట్ అయింది. ‘గ్రోక్ 3’ చాట్ బాట్ కు సంబంధించి ప్రీ-టెస్ట్ పోయిన నెల అంటే జనవరి 3న జరిగింది. ఇందులో ఈ ఏఐ మోడల్ మ్యాథమెటికల్ స్కిల్స్, కోడ్ జనరేషన్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అంశాలను పరీక్షించారు. ఇది ఓపెన్ఏఐ O1ను పోలి ఉంటుంది. ఎక్స్ఏఐ గ్రోక్ యాప్‌కి డీప్‌సెర్చ్ అనే కొత్త ఫీచర్‌ కూడా యాడ్ చేశారు. ఈ ఫీచర్ ట్విట్టర్(ఎక్స్)తో సహా ఇంటర్నెట్‌లోని దేని మీద అయినా లోతైన అధ్యయనం చేసి సమాచారాన్ని అందిస్తుంది. ఈ చాట్ బాట్ డీప్ సెర్చింగ్ప్రాసెస్లో ప్రైమరీ సెర్చ్, డేటా కలెక్షన్, బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ వంటివి ఉంటాయి. ‘గ్రోక్‌ 3’ని యాక్సెస్‌ చేయాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో దీని ధర నెలకు రూ.1750గా ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి చాట్ బాట్ లకు కాలం చెల్లినట్లేనని నిపుణులు చెబుతున్నారు.