Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే రామ్ చరణ్ (Ram Charan) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న ఆయన విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తక్కువ సినిమాలతోనే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన పేరు మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో మారుమ్రోగిపోతుంది లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు కలిగే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా విజయాన్ని సాధించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు…
మెగాస్టార్ చిరంజీవి సైతం రామ్ చరణ్ చేసిన సినిమాలన్నీ బావుంటాయి అంటూ చెబుతూనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చూడాలని ఉందని అలాంటి పాత్రలు రామ్ చరణ్ కి బాగా సెట్ అవుతాయని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నిజానికి రామ్ చరణ్ బాడీ చాలా గట్టిగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి అయిన, ఆర్మీ ఆఫీసర్స్ కి అయిన ఆయన సరిగ్గా సరిపోతాడు.
‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. కాబట్టి ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమాని చేస్తే బాగుంటుందని తన అభిమానులతో కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తొందర్లోనే ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమాని చేస్తాడా తన తండ్రి చూడాలనుకుంటున్న ఆ పాత్రను చేసి చూపిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి సైతం ఈ ఏజ్ లో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఇక ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకి పోటీని ఇస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తాడు. పాన్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడు…