Moon : చంద్రుడు పూర్ణిమ రోజు ఫుల్‌గా కనిపిస్తాడు. మిగతా రోజుల్లో కాస్త తక్కువగా ఉంటుంది. ఈ పూర్ణిమ (Poornima) సమయాల్లో ప్రకాశవంతంగా మెరుస్తుంటాడు. అయితే సూర్యకాంతి చిరాకును ఇస్తే.. చంద్రకాంతి మాత్రం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎంత టెన్షన్‌లో ఉన్నా కూడా చంద్రున్ని (Moon) చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు తినడానికి ఎంతో మారం చేస్తుంటారు. వీరికి తల్లిదండ్రులు (Parents) చందమామ రావే.. జాబిల్లి రావే అని పిలుస్తూ గోరు ముద్దలు తినిపిస్తారు. ఎందుకంటే పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ కూడా వెన్నెల అంటే ఇష్టమే. అర్థ చంద్రుడు (Moon) కనిపించినప్పుడు పిల్లలు తినడానికి ఎంతో మారం చేస్తుంటారు. అయితే ఈ చంద్రుడు కేవలం రాత్రిపూట మాత్రమే కనిపిస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చంద్రుడు పగటిపూట కూడా కనిపిస్తాడట. అసలు పగటి పూట చంద్రుడు కనిపించడం ఏంటి? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చంద్రుడు, నక్షత్రాలు కేవలం రాత్రిపూట మాత్రమే కాదు.. పగలు కూడా కనిపిస్తాయి. కానీ సూర్య కాంతి వల్ల వాటిని మనం చూడలేము. తక్కువ సూర్య కాంతి ఉంటే చంద్రుడు కనిపిస్తాడు. కానీ నక్షత్రాలు మాత్రం కనిపించవు. సూర్యుని నుంచి ప్రకాశవంతమైన కాంతి చంద్రుని ఉపరితలంపై తాకి పరావర్తనం చెందుతుంది. చంద్రుని ఉపరితలంపై ఎలాంటి వాతావరణం లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రుడు కనిపిస్తాడు. భూమికి సంబంధించి సూర్యుడు, చంద్రుడు వేర్వేరు స్థానాలలో ఉండటం వల్ల పగటి సమయంలో స్పష్టంగా కనిపించదు. పగలు చంద్రుడు కనిపిస్తాడా? లేదా? అనేది చంద్రుని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో కొన్నిసార్లు చంద్రుడు కనిపిస్తాడు. అయితే భూమి మీద ఉన్న వాళ్లకు కొన్నిసార్లు చంద్రుడు వివిధ రంగులలో కనిపిస్తాడు. దీనికి ముఖ్య కారణం ఇది హోరిజోన్‌కు దగ్గరగా ఉంది. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన కొద్ది సేపటికే అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న రాయి భూమిని ఢీకొనడంతో చంద్రుడు ఏర్పడ్డాడని చెబుతుంటారు. భూమితో పోలిస్తే, చంద్రుడు భూమి పరిమాణంలో నాలుగో వంతు. భూమి బరువు చంద్రుడు కంటే 80 రెట్లు ఎక్కువ. భూమికి చంద్రుడు మాత్రమే శాశ్వత సహజ ఉపగ్రహం. సౌర వ్యవస్థలో ఇది ఐదవ అతి పెద్ద సహజ ఉపగ్రహం కూడా. అయితే చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుంచి 3.8 సెం.మీ దూరంలో కదులుతాడు.