https://oktelugu.com/

Smart Glasses : స్మార్ట్‌ ఫోన్లు త్వరలో చెత్తబుట్టలో వేయాల్సిందే.. ఆ తర్వాత వాటిదే కాలం..!

మొబైల్‌ ఫోన్‌ మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనదిగా మారిపోయింది. దశాబ్దాలపాటు అనేక రూపాంతరాలు చెందిన ఫోన్‌.. ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోయింది. దీంతో మరింత ప్రాముఖ్యంగా మారింది. అయితే ఎప్పుడూ కొత్తదనం కోరుకునే మనిషి మార్పును ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉనన ఫోన్లు త్వరలోనే అంతం కానున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాబోతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 16, 2025 / 10:25 AM IST

    Smart Glass Technology

    Follow us on

    Smart Glasses : మొబైల్‌ ఫోన్‌ ఆవిష్కరణ తర్వాత మనిషి జీవితంలో అనేక మార్పులు జరిగాయి. ఇక మొబైల్‌ అభివృద్ధి కూడా ఒక ప్రకమ పద్ధతిలో జరిగింది. ఇలా అనేక అంశాలు మన జీవితంలో మార్పులకు కారణమవుతున్నాయి. పురాతన రాతియుగం నుంచి నేటి ఏఐ యుగం వరకు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్, మోడ్రన్‌ కమ్యూనికేషన్‌లో ఏఐ బేస్డ్‌ టూల్స్‌ వినియోగం వంటివి చూస్తున్నాం. అయితే ఇన్ని మార్పులు వచ్చినా.. మొబైల్‌ ఫోన్ల డామినేషన్‌ మాత్రం తగ్గడం లేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్‌ ఒక అవసరంగా మారిపోయింది. ఇలాంటి ఫోన్‌ అంతం కానుందని అంటున్నారు మెటా సీఈవో మార్క్‌ జూకర్‌బర్క్‌. సెల్‌ఫోన్‌ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్‌ఫోన్‌ అంతం త్వరలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. వాటిస్తానంలో స్మార్ట్‌ గ్లాసెస్‌ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.

    వేరబుల్‌ టెక్నాలజీ..
    రాబోయే రోజుల్లో మనిషి జీవితలో వేరబుల్‌ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) మనిషి జీవితంలో భాగం అవుతుందని జూకర్‌బర్గ్‌ అంచనా వేస్తున్నారు. సంపదాయ ఫోన్లకన్నా.. స్మార్ట్‌ గ్లాసెస్‌ను ఎక్కువగా వినియోగిస్తారని పేర్కొన్నారు. వీటి వినియోగం కూడా సులభంగా ఉంటుందని అంచనా వేశారు. అవుట్‌ డేటెడ్‌ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే అని వివరించారు. రాబోయే రోజుల్లో చుట్టుపక్కలవారితో కమ్యూనికేట్‌ అయ్యేందుకు స్మార్ట్‌ గ్లాసెస్‌ వంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తాయని జూకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఆ సంఖ్య ఫోన్లకన్నా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

    2030 నాటికే..
    స్మార్ట్‌ ఫోన్ల వాడకం 2030 నాటికే బాగా తగ్గిపోతుందని జూకర్‌బర్గ్‌ తెలిపారు. వాటి స్థానంలో స్మార్ట్‌ గ్లాసెస్‌ వినియోగం పెరుగుతుందని తెలిపారు. అయితే వేరబుల్‌ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొన్నారు. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యం కాదని వెల్లడించారు. క్రమపద్ధతిలో అది కూడా జరుగుతుందని తెలిపారు. తాజా సర్వేల ప్రకారం.. గడచిన ఐదేళ్లుగా స్మార్ట్‌ వేరబుల్స్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్‌ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌ను స్మార్ట్‌ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్‌ గ్లాసెస్‌ వినియోగమూ పెరిగింది.