ISRO: ఆర్టికల్ 370 తర్వాత లేహ్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పుడు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ప్రాంతంలో ఇస్రో అడుగుపెట్టింది.. తన మిషన్ ప్రారంభించింది. లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారం, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడక్ విశ్వవిద్యాలయం, బాంబే ఐఐటి ప్రోత్సాహంతో మిషన్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇస్రో లేహ్ ప్రాంతంలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని సృష్టిస్తుంది.. ఈ కేంద్రంలో అంతరిక్షంలో ఉన్నట్టుగానే పరిస్థితులు ఉంటాయి. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టినప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఈ స్పేస్ స్టేషన్ ఉపకరిస్తుందని చెబుతోంది. లేహ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న స్టేషన్ వల్ల భూమికి దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏర్పడే పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది.
భారీ అనలాగ్ మిషన్
లేహ్ ప్రాంతంలో ఇస్రో ఏర్పాటు చేసిన అత్యంత భారీ అనలాగే మిషన్ ఇదే. ఇది అంతరిక్షాన్ని పోలి ఉంటుంది. ఖగోళ వస్తువు తరహాలో వాతావరణం ఉంటుంది. ఇక్కడ పర్యావరణం కూడా విభిన్నంగా ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. ఇక్కడ వ్యోమగాములకు శిక్షణ ఇస్తారు. అయితే వచ్చేకాలంలో ఇస్రో అత్యంత అధునాతనమైన మిషన్లను చేపట్టనుంది. ఇందులో ప్రధానమైనది గగన్ యాన్. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలిసారి అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ ను ఇస్రో పంపించనుంది.. ఈ ప్రయోగానికి అంటే ముందు లేహ్ ప్రాంతంలో ఇస్రో ఏర్పాటు చేసిన అన లాగ్ మిషన్ అత్యంత ప్రముఖంగా మారింది. ఇక్కడ వచ్చే రోజుల్లో ఆస్ట్రోనాట్స్ కు శిక్షణ ఇస్తారు. అయితే లేహ్ వాతావరణం కొంతమేర చంద్రుడు, అంగారక గ్రహాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ చల్లటి, పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సముద్రమట్టానికి ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహకంగా ఉంటుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఇక ఈ అనలాగ్ మిషన్లో పాలుపంచుకునేవారు అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. వారు ఆ తరహా వాతావరణం అనుభవిస్తారు. ఇక భవిష్యత్ కాలంలో ఇస్రో ఇక్కడి నుంచి అంతరిక్ష యాత్రను చేపడుతుందని తెలుస్తోంది. ఈ మిషన్ లో ఆస్ట్రోనాట్స్ కు సమర్థవంతమైన శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి వారి మానసిక స్థితిని సిద్ధం చేసేందుకు ఈ అనలాగ్ మిషన్ ను ఉపయోగిస్తారు. అయితే దీనికోసం ఇస్రో ఎంత ఖర్చు పెడుతుందనే విషయం మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Isro launched the first analog mission in leh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com