Sunita Williams: అక్కడి నుంచి వారు తిరిగి వచ్చే క్రమంలో క్యాప్సూల్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో వారు అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. వారు తిరిగి భూమ్మీదకు రావడానికి చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాదే వారు తిరిగి భూమ్మీదికి వస్తారు. జూన్ 5న వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారిని స్టార్ లైనర్ అక్కడికి తీసుకెళ్లింది. తిరిగి వచ్చే సమయంలో ప్రొపల్షన్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. నాసా తీసుకున్న నిర్ణయం కారణంగా దీంతో వారు అక్కడే ఉండిపోయారు. చాలా నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండడం వల్ల సునీత ఆరోగ్యం క్షీణిస్తోందని.. ఆమె అనారోగ్యానికి గురైందని తెలుస్తోంది. సునీత, విల్ మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తోంది. ఆ ఫోటో ప్రకారం సునీత బరువు తగ్గినట్టు తెలుస్తోంది. ఆమె బుగ్గలు లోపలికి వెళ్ళినట్టుగా అవగతం అవుతోంది. అయితే ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అందువల్లే బలహీనంగా మారిపోయారని సమాచారం. ఇదే విషయంపై శ్వాస కోశ సంబంధిత వ్యాధుల నిపుణులు డాక్టర్ వినయ్ గుప్తా సునీత ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కొంతకాలంగా అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఆ వ్యాధులు వస్తాయట
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుందట. అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితిని ఎదుర్కొంటారు. దీనిని స్పేస్ ఎనీమియా అని చెబుతుంటారు. మైక్రో గ్రావిటీ లో ఎక్కువకాలం ఉన్నప్పుడు.. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి ఎంటర్ ఇచ్చినప్పుడు.. స్పేస్ ఎనీమియా మొదలవుతుంది. ఆ సమయంలో శరీరం తనకు కావలసిన ఆక్సిజన్ అవసరాలను పూర్తిగా తగ్గించుకుంటుంది. అంతేకాదు ఆ సందర్భంలో ఎర్ర రక్త కణాలను దేహం నాశనం చేసుకుంటుంది. దీనికి కారణం మైక్రో గ్రావిటీ పరిస్థితులే.. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు శరీరం తన సమతౌల్యాన్ని కాపాడుకుంటుంది. అలాంటప్పుడు ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల నీరసం వస్తుంది. నిస్సత్తువ ఉంటుంది. శారీరకంగా బరువు తగ్గుతారు. మానసికంగా ఇబ్బంది పడతారు. అప్పుడప్పుడు గుండె పనితీరు కూడా ప్రభావితమవుతుంది. వాస్తవానికి సునీత, విల్ మోర్ కేవలం ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా ప్రయాణించారు. జూన్ 14న వారు తిరిగి భూమ్మీదకు రావాల్సి ఉండేది. అయితే వాడు ప్రయాణించిన వ్యోమ నౌక లో హీలియం గ్యాస్ లీకేజీ అయ్యింది. దానికి సాంకేతిక సమస్యలు కూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఉండాల్సి ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Is sunita williams safe in the international space center what do the doctors say about her health
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com