iPhone alert : స్మార్ట్ ప్రపంచంలో ఎన్ని ఫోన్లు ఉన్నప్పటికీ.. ఐఫోన్ రేంజ్ వేరే విధంగా ఉంటుంది. చాలామంది ఈ ఫోన్ వాడడాన్ని సామాజిక హోదాగా భావిస్తుంటారు.. పెరుగుతున్న వినియోగదారులకు తగ్గట్టుగానే ఆపిల్ కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో ఆకట్టుకుంటున్నది. కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నది. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఆపిల్ ఫోన్లు అత్యంత సమర్థవంతమైనవి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పైగా ఆపిల్ ఉత్పత్తుల్లో ఆ కంపెనీ అత్యంత నాణ్యమైన పరికరాలను వాడుతూ ఉంటుంది. సైబర్ మోసగాళ్లు అటాచ్ చేయకుండా ఉండేందుకు అత్యాధునికమైన సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే గత ఏడాది ఐఫోన్లు కూడా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయని వార్తలు వచ్చాయి. కొంతమంది పొలిటికల్ లీడర్లకు మీ ఫోన్ హ్యాక్ అయింది అనే మెసేజ్ లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో సమస్య వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ వినియోగదారుల్లో బగ్ సమస్య వెలుగు చూసిందని తెలుస్తోంది. ఎందుకంటే వారి ఫోన్లలో కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పుడు అవి క్రాష్ అవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ మాత్రమే కాకుండా ఐ ప్యాడ్స్ కూడా క్రాష్ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ బగ్ వల్ల ఫోన్ వెంటనే క్రాష్ అయిపోతుందట. నిమిషాల వ్యవధిలోనే స్తంభించిపోతోందట. ఈ కొత్త బగ్ వల్ల ఐఫోన్ హోమ్ స్క్రీన్ కొంత సమయంలోపల క్రాష్ అవ్వడాన్ని తమ గమనించామని చెబుతున్నారు కొంతమంది టెక్నాలజీ నిపుణులు.
ఇదే తొలిసారి కాదు
ఐఫోన్ వినియోగదారులు బగ్ సమస్యను చవి చూడటం ఇదే మొదటిసారి కాదు. ఐఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు గతంలో చాలా సార్లు యూజర్లు అనేక రకాల ఇబ్బందులను చవిచూశారు. ఇక ఈ కొత్త బగ్ గురించి మాస్టో డాన్ కు చెందిన పరిశోధకులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రస్తావించారు. ఈ బగ్ ఏర్పడేందుకు కారణాన్ని కూడా వారు అందులో వెల్లడించారు.. స్పాట్లైట్ శోధనలో భాగంగా ఐఫోన్ యూజర్ యాప్ లైబ్రరీలో అక్షరాలను టైప్ చేయడం వల్ల క్రాష్ సమస్య ఎదురవుతుందని తెలుస్తోంది.. ఐఫోన్ యాప్ లైబ్రరీ లేదా స్పాట్ లైట్ శోధనలో “..” అని టైప్ చేయడం వల్ల ఫోన్ కు సంబంధించిన హోం స్క్రీన్ పూర్తిగా క్రష్ అవుతుంది. ఇలా చేయడం వల్ల చాలామంది యూజర్ల ఫోన్లు ఫ్రీజింగ్ అవుతున్నాయి. వీటిని టైప్ చేయడం వల్ల బగ్ యాక్టివేట్ అవుతుందని టెక్నాలజీ ఎన్నికలలో చెబుతున్నారు. ఆదమరిచి కూడా ఈ నాలుగు అక్షరాలను టైప్ చేయవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ బగ్గు తనిఖీ చేయాలి అనుకుంటే “..” టైపు చేయాలని.. దానికంటే ముందు ఫోన్ బ్యాకప్ తీసుకోవాలని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఫోన్ లో ముఖ్యమైన సమాచారం కనుక ఉంటే.. ఇంకో పరికరంలో భద్రపరచుకోవాలని వెల్లడిస్తున్నారు. ఒకవేళ బగ్ కనుక ఉంటే ఫోన్లో ఉన్న డాటా మొత్తం క్రాష్ అయిపోతుంది.
ఆపిల్ ఏమంటుందంటే..
ఈ బగ్ నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో.. ఇంతవరకు ఆపిల్ స్పందించలేదు. అయితే త్వరలో దీనిపై ఆ కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావాన్ని టెక్నాలజీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.. అయితే త్వరలో iOS అప్డేట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈ బగ్ ను నివారించేందుకు ఆపిల్ ఏదైనా మార్గం అన్వేషిస్తుందో చూడాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Iphone alert using an iphone dont even type these four words by mistake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com