Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSpace Elevator: రాకెట్లు అవసరం లేదు.. అంతరిక్షానికి జస్ట్ లిఫ్ట్ లో వెళ్లి రావచ్చు..

Space Elevator: రాకెట్లు అవసరం లేదు.. అంతరిక్షానికి జస్ట్ లిఫ్ట్ లో వెళ్లి రావచ్చు..

Space elevator: ఒక భవనం పైకి వెళ్లాలంటే మనం లిఫ్ట్ ఉపయోగిస్తాం. కానీ అదే లిఫ్టులో అంతరిక్షంలోకి వెళ్లాలంటే.. అదేంటి అదెలా సాధ్యం అనే ప్రశ్న మీలో ఉత్పన్నమవుతోంది కదూ. మీలో అలాంటి ప్రశ్న ఉత్పన్నమవ్వడం కరెక్టే. కానీ అంతరిక్షానికి లిఫ్టులో వెళ్లడం అనేది త్వరలో సాధ్యం కానుంది. జపాన్ దేశానికి చెందిన ఒక కంపెనీ దీనికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్షానికి లిఫ్ట్ నిర్మించాలని భావిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది నుంచి దీనికి సంబంధించి పనులు ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒకవేళ ఇది గనుక వాస్తవ రూపం దాల్చితే.. అత్యంత సులువుగా, చౌకగా అంతరిక్షంలోకి మనుషులు వెళ్లిపోవచ్చు.. చివరికి సరుకులు కూడా రవాణా చేయవచ్చు.

ఎలా పుట్టిందంటే

అంతరిక్షంలోకి లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఈనాటిది కాదు. 130 సంవత్సరాల క్రితం రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ సియోల్ కోవ్ స్కీ 1895లో తాను రాసిన డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలో ఈ స్పేస్ లిఫ్ట్ ఆలోచన చేశారు.. ఇందులో భాగంగా 22 వేల మైళ్ళ ఎత్తులో ఉన్న ఒక ఊహాజనిత టవర్ ను పుస్తకంలో వర్ణించారు. అయితే ఈ ఊహాజనిత టవర్ నిర్మాణాన్ని యూరి ఆర్ట్స్ టానోవ్ తదుపరి దశకు తీసుకెళ్లారు. భూమి నుంచి భూమి అనువర్తిత కక్ష్యలోకి ఒక శాటిలైట్ వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని.. దాని సహాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని అప్పట్లో యూరి ప్రతిపాదించారు.

లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది

1895లో డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకం లోని ఆలోచనను వాస్తవరూపంలోకి తీసుకురావడానికి జపాన్ దేశానికి చెందిన ఒబయాషి కార్పొరేషన్ నిర్ణయించింది. టోక్యో స్కైట్రీ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ టవర్ నిర్మించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. ఈ కంపెనీ ప్రతిపాదిస్తున్న లిఫ్టును స్పేస్ ఎలివేటర్ గా పేర్కొంటున్నారు. భూ కక్ష్య లోకి, దాని వెలుపలికి యాత్రలు చేసేందుకు ఇది వీలును కల్పిస్తుంది. వచ్చే ఏడాది దీని పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి ఇది పూర్తవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 100 బిలియన్ డాలర్లుగా ఒబ యాషి కార్పొరేషన్ నిర్ణయించింది.

ఎలా పనిచేస్తుందంటే

స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా భూమి నుంచి అంతరిక్షంలోకి భూ స్థిర కక్ష్య లోని శాటిలైట్ వరకు కేబుల్ ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్ భూమితో భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల అది భూమికి పైన.. ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటుంది.

అంతరిక్షంలో ఉండే లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి 96,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దీనిని కౌంటర్ వెయిట్ అని పిలుస్తారు.. ఈ కౌంటర్ వెయిట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. భూమధ్యరేఖకు సముద్ర ప్రాంతంలో ఎర్త్ ఫోర్ట్ నిర్మిస్తారు. ఇందులో బలాస్ట్ అనే నిర్మాణం ఉంటుంది.
కేబుల్ టెన్షన్ ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు. ఎత్తు పోర్టు కు దగ్గర్లో నేలపై మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సముద్రంలోకి ఎర్త్ పోర్టు చేరుకునేందుకు.. సముద్ర మార్గంలోని కింది ప్రాంతం నుంచి ఒక సొరంగాన్ని నిర్మిస్తారు. ఈ కేబుల్ సహాయంతో క్లైంబర్ అనే విద్యుత్ అయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్తాయి. అంతే వేగంతో కిందికి వస్తాయి. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదు కాబట్టి.. అందులో ఆమ్లజని ఏర్పాటు చేస్తారు.. భూమి నుంచి కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత భార రహిత స్థితి ఉంటుంది కాబట్టి.. దానిని తట్టుకునేందుకు అందులో ఏర్పాట్లు చేస్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular