https://oktelugu.com/

Instagram New Feature: ఇన్ స్టా కొంగొత్తగా.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్.. యూజర్లకు పండగే పండుగ..

చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో సోషల్ మీడియా యాప్స్.. ఇవి లేకుండా రోజు గడవని పరిస్థితి నెలకొంది. వయసు తేడా లేకుండా గంటలకు గంటలు అందరూ అందులోనే గడుపుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 28, 2024 / 09:45 AM IST

    Instagram New Feature

    Follow us on

    Instagram New Feature: కొంతమంది సమాచారం కోసం.. మరి కొంతమంది కాలక్షేపం కోసం.. ఇంకొంతమంది వినోదం కోసం ఇలా రకరకాల వ్యాపకాలతో సోషల్ మీడియా యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియా యాప్స్ రకరకాల మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. యూజర్లకు మరింత అనుభూతిని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాంకేతికతను కూడా అనుసంధానించాయి. ఇది యూజర్లకు మరింత ఉపయుక్తమైన సాంకేతికత అనుభూతిని అందిస్తోంది. అయితే మారుతున్న యూజర్ల అవసరాలకు అనుగుణంగా సోషల్ మీడియా యాప్స్ కూడా మరింత సాంకేతికతను జోడిస్తున్నాయి. ఈ సాంకేతికతను అనుసంధానించుకోవడంలో ఇన్ స్టా గ్రామ్ ముందంజలో ఉంది. మెటా యాజమాన్యం ఆధీనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ యాప్.. మరింత ఆధునికతను యూజర్లకు అందిస్తున్నది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఈ ఫ్యూచర్ ఎలా పనిచేస్తుందంటే..

    ఎలా పనిచేస్తుందంటే..

    ఇన్ స్టా గ్రామ్ యాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహా లోనే IG లోనూ లొకేషన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనిని ఉపయోగించాలంటే యూజర్లు ముందుగా చాట్ లోకి వెళ్ళాలి. అనంతరం మెనూ బార్ లొకేషన్ లోకి వెళ్ళాలి. దాని ఓకే చేయాలి. కరెంటు లొకేషన్ తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.. అయితే ప్రస్తుతం ఈ అవకాశం కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. తదుపరి దశలో మిగిలిన దేశాలకు కూడా వర్తించనుంది. ” యూజర్లకు మెరుగైన సాంకేతిక అనుభవాన్ని అందించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఐజి లోకేషన్ షేర్ చేసుకునే ఆకాశాన్ని తీసుకొచ్చాం. ఇది యూజర్లకు సరికొత్త సాంకేతిక అనుభూతిని తీసుకొస్తుంది. యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి.. ఉన్న యూజర్ల స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నాం.. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రకరకాల ప్రయోగాలు చేశాం. వాటి ద్వారా యూజర్లు మెరుగైన ప్రయోజనాలు పొందడానికి మార్పులు చేర్పులు చేశాం. ఇప్పుడు ఆ అనుభూతిని యూజర్లు ఆస్వాదిస్తున్నారు. వచ్చే రోజుల్లో యాప్ లో సమూల మార్పులు తీసుకొస్తాం. యూజర్లకు మరిన్ని సౌలభ్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని” మెటా యాజమాన్యం చెబుతోంది. అయితే ఇటీవల కాలంలో ఇన్ స్టా గ్రామ్ లో మధ్యస్థ అశ్లీల దృశ్యాలు పెరిగిపోయాయి. దీంతో యాజమాన్యంపై ఆరోపణలు రావడంతో.. యుక్త వయసు పిల్లలు, బాల బాలికలను దృష్టిలో పెట్టుకొని స్లీపింగ్ మోడ్ ను తెరపైకి తీసుకొచ్చింది. మొదట్లో అమెరికా వంటి దేశాల్లో ఈ విధానాన్ని అమలులో తెచ్చిన మెటా.. ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించడం మొదలుపెట్టింది. దీంతో యుక్త వయసు పిల్లలు మద్యస్థ అశ్లీల దృశ్యాలను చూసే వీల్లేకుండా పోయింది.