Gaddar Awards Function: 2014 వ సంవత్సరం నుండి 2024 వ సంవత్సరం వరకు అత్యంత ప్రేక్షాధారణ పొందిన నటీనటులను, దర్శక నిర్మాతలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి, అవార్డ్స్ ని ఎంపిక చేయడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి టాలీవుడ్ లోని ప్రముఖులందరినీ తీసుకొచ్చే బాధ్యతను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) కి అప్పగించింది ప్రభుత్వం. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో పాటు, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వంటి వారు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. గత జనరేషన్ కి సంబంధించిన ఈ టాప్ 4 హీరోలను ఒకే వేదికపై చూసే అదృష్టం నేడు మూవీ లవర్స్ కి కలగబోతుంది.
Read Also: మొన్నటిదాకా అన్నను టార్గెట్ చేసి.. ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్న కవిత.. కథేంటి
ఇకపోతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కూడా హాజరు కాబోతున్నాడు. 2020 వ సంవత్సరం లో ‘అలా వైకుంఠపురం లో’ చిత్రానికి, అదే విధంగా 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘పుష్ప 2’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆయన ఈ అవార్డు ని అందుకోబోతున్నాడు. ప్రస్తుతం ఆయన ముంబై లో అట్లీ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. కానీ నేడు ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఆయన హైదరాబాద్ కి రాబోతున్నాడు. చిరంజీవి, అల్లు అర్జున్ ని ఒకే ఈవెంట్ లో చూసి అభిమానులకు చాలా ఏళ్ళు అయ్యింది. అదే విధంగా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ లు కూడా ఒకే వేదిక పై కనిపించలేదు. నేడు ఈ అరుదైన ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి.
Read Also: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కనిపించనున్న స్టార్ హీరో.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే వేదిక పై కనిపించడం ఎంతో స్పెషల్. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసిలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణమని ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ ని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా అందుకు కౌంటర్ ఇచ్చాడు. ఇలా వీళ్ళ మధ్య జరిగిన కోల్డ్ వార్ ని దేశమంతా చూసింది. అలాంటి వ్యక్తులు కలవడమే ఇప్పుడు స్పెషల్. చూడాలి మరి ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుంది అనేది. మహేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.