One Plus phone : వన్ ప్లస్ అనేది చైనాకు సంబంధించిన కంపెనీ తయారుచేసే ఫోన్. ఇప్పటికే దీనిలో వేరియంట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. 15 వేల నుంచి 1,40,000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో ఆపిల్ కంపెనీ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు వన్ ప్లస్ తన ఉత్పత్తులను మరింత విస్తృతంగా విడుదల చేసింది. 5 G లో ఎన్నో వేరియంట్లను అందుబాటులోకి ఉంచింది. ఆ కంపెనీ అంచనా వేసినట్టుగానే చాలా వరకు ఫోన్లు అమ్ముడుపోయాయి. ఒక నివేదిక ప్రకారం చైనా వెలుపలి మార్కెట్ లో ఎక్కువగా భారత్ లోనే ఈ కంపెనీ ఫోన్లు అమ్ముడుపోయాయి. శీఘ్రంగా చార్జింగ్ అయ్యే బ్యాటరీ, అద్భుతమైన యాంటి వైరస్, ఊహకందని బ్యాకప్, అధునాతమైన కెమెరా వంటి ఫీచర్లతో వన్ ప్లస్ భారతీయులను ఇట్టే ఆకట్టుకుంది.. మార్కెట్లోకి వన్ ప్లస్ ఎన్నో వేరియంట్లను ప్రవేశపెట్టినప్పటికీ ఇట్టే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి.. అయితే మొదట్లో ఈ కంపెనీ ఫోన్లు బాగానే పని చేశాయి. పైగా డిమాండ్ బాగా ఉండడంతో ఈ కంపెనీ ఫోన్లకు కొన్నిసార్లు కొరత కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన ఫోన్ల విషయంలో ఒక వార్త యూజర్లను ఇబ్బంది గురి చేస్తోంది.
ఆ మోడల్స్ లో సమస్య
వన్ ప్లస్ కు సంబంధించిన 9,10 మోడల్ ఫోన్లపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. ముఖ్యంగా ఈ ఫోన్లో లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయగానే మదర్ బోర్డులో సమస్య ఎదురవుతోంది. ఫోన్ వెంటనే ఆగిపోతోంది. తిరిగి ఆన్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఒక్కోసారి సిమ్ కార్డులు కూడా పనిచేయడం లేదు.. చార్జింగ్ పెట్టినా కూడా ఎక్కడం లేదు. దీంతో చాలామంది యూజర్లు వన్ ప్లస్ సర్వీస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వన్ ప్లస్ కంపెనీ స్పందించింది. “యూజర్ల బాధలను మేము అర్థం చేసుకున్నాం. సాధ్యమైనంతవరకు ఈ సమస్యను పరిష్కరించేందుకు మా సాంకేతిక బృందం పనిచేస్తుంది. ఇంతవరకు సమస్య ఎక్కడ ఎదురయిందో గుర్తించలేదు. త్వరలో ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఈ సమస్యను సారీ తిట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమస్య ఎదురవుతున్న వారు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవద్దు. కంపెనీ అధికారికంగా చెప్పేంతవరకు అలాంటి పనులు చేయొద్దు.. ఇలాంటి అప్డేట్ మాల్ వేర్ కనుక ఉంటే యూజర్ల భద్రతకే ప్రమాదం వాటిల్లుతుంది. ఒక్కసారి మాల్ వేర్ ఫోన్ లోకి ప్రవేశిస్తే దొంగకు తాళం చెవి ఇచ్చినట్టే అవుతుంది. అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా యూజర్లు జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు కంపెనీ అధికారికంగా ప్రకటించేంతవరకు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవద్దని” వన్ ప్లస్ చెబుతోంది..
అమ్మకాలు తగ్గిపోయాయి
ఈ సమస్యల నేపథ్యంలో వన్ ప్లస్ అమ్మకాలు తగ్గిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..” మొదట్లో ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగానే ఉండేవి. ఆ తర్వాత క్రమేపీ తగ్గడం మొదలైంది. ముఖ్యంగా సాప్ట్ వేర్ సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి పరిష్కారానికి కంపెనీ ఎటువంటి మార్గం చూపించలేదు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోంది. అందువల్లే ఇతర కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.. ఒకవేళ కంపెనీ గనుక నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై భారతీయులకు నమ్మకం పోయింది. వన్ ప్లస్ కంపెనీ ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలు ఆ నమ్మకాన్ని మరింత సడలిస్తున్నాయి. ఇప్పటికైనా వన్ ప్లస్ కంపెనీ పునరాలోచించుకోవాలని” మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: If you are using a oneplus phone then you have to follow these precautions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com